చాణక్య నీతి: మీలో మితిమీరిన మంచితనం ఉందా? తక్షణం స్వభావం మార్చుకోండి.. లేకుంటే సమస్యలు చుట్టుముడతాయి!

ABN , First Publish Date - 2021-12-19T12:58:31+05:30 IST

జీవితంలో ఆనందాన్ని, శాంతిని కోరుకునేవారు..

చాణక్య నీతి: మీలో మితిమీరిన మంచితనం ఉందా? తక్షణం స్వభావం మార్చుకోండి.. లేకుంటే సమస్యలు చుట్టుముడతాయి!

జీవితంలో ఆనందాన్ని, శాంతిని కోరుకునేవారు చాణక్యుని జీవన విధానాలను తప్పనిసరిగా అవలంబించాలి.  ఆచార్య చాణక్య తెలిపిన విధానాలు, ఆలోచనలు కొంచెం కఠినంగా అనిపించినప్పటికీ, అవి జీవిత సత్యాలని పండితులు చెబుతుంటారు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాణక్య ఆలోచనలు అందరికీ ఎంతగానో ఉపయోగపడతాయి. ఆచార్య చాణక్య తన చాణక్య నీతిలో.. మితిమీరిన మంచితనంతో మెలిగేవారి గురించి పలు విషయాలు తెలిపారు. 


నాత్యంతం శరళేన్ భవ్యం గత్వా పశ్య వనస్థలిమ్,

ఛిద్యన్తే సరళాస్తత్ర కుబ్జాస్తిష్ఠన్తి పాదపా ॥

ఆచార్య చాణక్య ఈ శ్లోకంలో ఒక వ్యక్తిని చెట్టుతో పోల్చాడు. అవసరానికి మించి ముక్కుసూటిగా ఉండేవారు లేదా మితిమీరిన మంచితనంతో మెలిగేవారు నష్టపోవాల్సి వస్తుందని ఆచార్య చాణక్య తెలిపారు. ఇటువంటి స్వభావం కలిగినవారు ఎందుకు మారాలో కూడా వివరించారు. అడవిలో నిటారుగా ఉన్న చెట్లనే ముందుగా నరికి వేస్తారనే సంగతిని చాణక్య గుర్తుచేశారు. ఈ శ్లోకం ద్వారా.. మనిషి ఏ స్వభావాన్నయినా అధికంగా కలిగివుండటం మంచిది కాదని చాణక్య సూచించారు. మీ స్వభావం సూటిగా, మితిమీరిన మంచితనంతో ఉంటే దాని పర్యవసానాన్ని భరించవలసి వస్తుందని చాణక్య హెచ్చరించారు. మీకున్న మీతిమీరిన మంచితనం కారణంగా మీ చుట్టుపక్కలవారు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. తరువాత సమస్యలు సృష్టిస్తారు. పలు సందర్భాల్లో ముక్కుసూటిగా ఉండేవ్యక్తి తాను చేయని తప్పునకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఫలితంగా వారి కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు పడతారు. అందుకే ముక్కుసూటిగా ఉండేవారు, మంచితనంతో మెలిగేవారు చాలా తెలివిగా వ్యవహరించాలని, అన్ని సందర్భాల్లోనూ ముక్కుసూటితనం మంచిదికాదని ఆచార్య చాణక్య సూచించారు. 

Updated Date - 2021-12-19T12:58:31+05:30 IST