చాణక్య నీతి: భార్యాభర్తల మధ్య ప్రేమను మూడింతలు చేసే 3 కీలక విషయాలు.. గుర్తుంచుకుంటే సమస్యలే రావు!

ABN , First Publish Date - 2021-12-26T12:15:07+05:30 IST

ఆచార్య చాణక్య తాను తెలియజెప్పిన జీవన విధానాలలో...

చాణక్య నీతి: భార్యాభర్తల మధ్య ప్రేమను మూడింతలు చేసే 3 కీలక విషయాలు.. గుర్తుంచుకుంటే సమస్యలే రావు!

ఆచార్య చాణక్య తాను తెలియజెప్పిన జీవన విధానాలలో అనేక విషయాలను వివరించారు. ఇందులో మానవ సంబంధాల గురించి కూడా చాలా సమాచారం అందించారు. ఒక వ్యక్తి తన జీవితంలో చాణక్య తెలిపిన పద్ధతులను అమలు చేస్తే అతని పురోగతిని ఎవరూ అడ్డుకోలేరు. అలాంటి వ్యక్తికి సమాజంలో ఎప్పుడూ గౌరవం దక్కుతుంది. భార్యాభర్తల మధ్య సంబంధం గురించి కూడా చాణక్య నీతిలో పేర్కొన్నారు. భార్యాభర్తల బంధాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. భార్యాభర్తల మధ్య వైరం ఏర్పడితే ఆ ఇల్లు నరకంగా మారుతుంది. ఇటువంటి వివాదాల కారణంగా వారి మధ్య దూరం ఏర్పడుతుంది. ఫలితంగా వారు విడిపోయే పరిస్థితులు తలెత్తవచ్చు. అందుకే భార్యాభర్తలు ఆచార్య చాణక్య తెలిపిన జీవన విధానాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం భార్యాభర్తలు 3 విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. అవేమిటో ఇప్పుడు చూద్దాం...


ఆనందం ఆవిరి కానివ్వకండి

భార్యాభర్తలు తమ జీవితంలో ఆనందాన్ని ఎప్పటికీ తగ్గకుండా చూసుకోవాలని ఆచార్య చాణక్య తెలిపారు. భార్యాభర్తలు మంచి లేదా చెడు సమయాల్లో ఒకరికొకరు తోడుగా ఉండాలి. పరస్పర సహకారంతో ప్రతి పనిలో సమాన భాగస్వామ్యం వహించాలి. 

ప్రేమతో పాటు గౌరవం కూడా అవసరం 

భార్యాభర్తలు కేవలం ప్రేమించుకుంటే సరిపోదని పరస్పరం గౌరవించుకోవాలని ఆచార్య చాణక్య తెలిపారు. ప్రేమ ఒక్కటే ఉంటే అది స్వల్పకాలం మాత్రమే ఉంటుందని, దానికి పరస్పర గౌరవం తోడయితే ఆ బంధం దీర్ఘకాలం ఉంటుందని చాణక్య తెలిపారు. అయితే దంపతులు పరస్పరం ఒకరి గౌరవాన్నిమరొకరు దెబ్బతీస్తే వారి మధ్య దూరం పెరిగే అవకాశాలు ఉంటాయని ఆచార్య చాణక్య తెలిపారు. 

ఇతరుల ముందు దూషించుకోవద్దు

చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం భార్యాభర్తలు పరస్పరం ఇతరుల ముందు ఒకరినొకరు దూషించుకోకూడదు.  భాగస్వామి తప్పు చేసి ఉంటే, ఆ విషయాన్ని ఇంటిలోనే చర్చించుకుని పరిష్కరించుకోవాలి. ఇతరుల ముందు దీని గురించి చెబుతూ, ఒకరినొకరు దూషించుకోవడం వలన  అందరిముందు భార్యా భర్తలు చులకన అవుతారు. బయట కూడా గౌరవం కోల్పోతారు. ఇది భార్యాభర్తల అనుబంధాన్ని దెబ్బతీస్తుందని ఆచార్య చాణక్య తెలిపారు.Updated Date - 2021-12-26T12:15:07+05:30 IST