చాణక్యనీతి: ఈ సందర్భాల్లో డబ్బుకు వెనుకాడకుండా ఖర్చు చేయాలి.. లేదంటే జీవితాంతం బాధపడతారు!
ABN , First Publish Date - 2021-10-29T11:52:34+05:30 IST
ప్రముఖ వ్యూహకర్త, ఆర్థికవేత్త..

ప్రముఖ వ్యూహకర్త, ఆర్థికవేత్త, రాజకీయ చతురత కలిగిన ఆచార్య చాణక్య తన సామాజిక పరిజ్ఞానం కారణంగా ప్రసిద్ధి చెందారు. ఆచార్య చాణక్యుడు ఎప్పటికీ ప్రజలకు ఉపయోగపడే నీతిని అందించారు. చాణక్య నీతిలో.. ఆయన మనిషి జీవితంలోని దాదాపు అన్ని అంశాలపై జ్ఞానాన్ని అందించారు. జీవితాన్ని ఆనందంగా మలచుకునేందుకు ఆచార్య చాణక్య అనేక విధానాలను వివరించారు. ఆచార్య చాణక్య.. డబ్బు ఖర్చు చేయడానికి సంబంధించిన కొన్ని కీలక విషయాలను ప్రస్తావించారు. కొన్ని సందర్భాల్లో డబ్బు ఖర్చు చేయడానికి ఎప్పుడూ వెనుకడుగు వేయకూడదని, లేదంటే జీవితాంతం బాధపడవలసి వస్తుందని చాణక్య తెలిపారు.
రోగుల సహాయం: ఆచార్య చాణక్య.. పేద రోగుల వైద్య సహాయానికి సాధ్యమైనంత మేరకు డబ్బు ఖర్చు చేయాలని తెలిపారు. ఎ౦దుక౦టే మన ఎదుట అనారోగ్య౦తో తల్లడిల్లిపోతున్న వారికి సహాయ౦ చేయకపోతే, ఆ తరువాత పశ్చాత్తాపపడవలసి వస్తుందని ఆచార్య చాణక్య తెలిపారు. పేద రోగులను ఆదుకుంటే దేవునికి సంతోషం కలిగించినవారమవుతామని, సమాజంలో గౌరవం పెరుగుతుందని చాణక్య వివరించారు.
అర్హులకు సహాయం: పేదలు, అర్హులైనవారికి సహాయం చేయాలని, ఈ విషయంలో వీలైనంత డబ్బు ఖర్చు చేయడం మనిషికి యోగ్యతను అందిస్తుందని చాణక్య తెలిపారు. పేద పిల్లల విద్య కోసం డబ్బు ఖర్చు చేయవచ్చని చాణక్య సూచించారు. ఇందుకోసం మీ ఆదాయంలో కొంత భాగాన్ని విరాళంగా అందించాలని చాణక్య తెలిపారు. ఇలా చేయడం ద్వారా దేవుడు మీకు సంతోషాన్ని అందిస్తాడని చాణక్య పేర్కొన్నారు.
సామాజిక సేవ: ఒక వ్యక్తి తన సంపాదనలో కొంత భాగాన్ని సామాజిక సేవకు ఖర్చు చేయాలి. మనిషి తన సంపాదనలో కొంత భాగాన్ని ఆసుపత్రులు, పాఠశాలల అభివృద్ధికి విరాళంగా ఇవ్వవచ్చు. సామాజిక సేవ చేయడం వల్ల ఆదరణ పెరుగుతుంది. అదే సమయంలో అందరి అభినందనలు అందుకుంటారని చాణక్య తెలిపారు.
ధార్మిక ప్రదేశాలకు విరాళం: ధార్మిక, మతపరమైన ప్రదేశాలకు విరాళం ఇవ్వడం ద్వారా జీవితంలో సానుకూలత ఏర్పడుతుందని ఆచార్య చాణక్య తెలిపారు. ఈ లక్షణం మీ జీవితాన్ని సంతోషంగా ఉంచడమే కాకుండా మీ కుటుంబంలో శాంతియుత వాతావరణాన్ని పెంచుతుందని చాణక్య తెలిపారు.