బిల్ మిలిండా గేట్స్ పెద్ద కుమార్తె Jennifer Gates పెళ్లి ఎలా జరిగిందంటే...

ABN , First Publish Date - 2021-10-19T14:17:05+05:30 IST

బిల్, మెలిండా గేట్స్ పెద్ద కుమార్తె జెన్నిఫర్ గేట్స్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది...

బిల్ మిలిండా గేట్స్ పెద్ద కుమార్తె Jennifer Gates పెళ్లి ఎలా జరిగిందంటే...

న్యూయార్క్‌(అమెరికా): బిల్, మెలిండా గేట్స్ పెద్ద కుమార్తె జెన్నిఫర్ గేట్స్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈజిప్టు ఈక్వెస్ట్రియన్ అయిన నయెల్ నాసర్ అనే యువకుడితో జెన్నిఫర్ గేట్స్ వివాహం న్యూయార్క్‌లోని వెస్ట్‌చెస్టర్‌లో లావిష్‌గా జరిగింది.పెళ్లి వేడుకలో జెన్నిఫర్ గేట్స్ ఎంబ్రాయిడరీతో కూడిన వెరావాంగ్ స్వీవ్ గౌను ధరించింది.వరుడు నయెల్ నాసర్ తెల్లటి చొక్కా, నల్లటి సూట్ వేసుకున్నారు.ఉత్తర సేలంలోని తన కుటుంబానికి చెందిన 142 ఎకరాల ఎస్టేట్‌ తోటలో 300 మంది అతిథులతో ఘనంగా వివాహం జరిగింది. వీరిద్దరిది ప్రేమ వివాహం. జెన్నిఫర్ గేట్స్, నయెల్ నాసర్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 


వీరి వివాహం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరి వివాహానికి విడిపోయిన తల్లిదండ్రులు బిల్‌గేట్స్, మెలిండా గేట్స్ లు హాజరు అయినట్లు వార్తలు వెలువడలేదు. బిల్‌గేట్స్, మెలిండా గేట్స్ 27 సంవత్సరాల వివాహం తరువాత ఈ ఏడాది ఆగస్టులో అధికారికంగా విడాకులు తీసుకున్నారు.మే నెలలో విడాకుల ప్రకటన తర్వాత బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ భవిష్యత్తుపై దృష్టి పెట్టారు.బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ధర్మకర్త వారెన్ బఫెట్ కూడా జూన్ నెలలో బోర్డు నుంచి వైదొలిగారు.


Updated Date - 2021-10-19T14:17:05+05:30 IST