మోదీ కోసం పడవ!.. ఏంకాదని చెప్పా..!కానీ... బేర్ గ్రిల్స్ వైరల్ పోస్ట్!

ABN , First Publish Date - 2021-02-06T22:50:42+05:30 IST

గతంలో ప్రధాని మోదీతో బేర్ గ్రిల్స్ నిర్వహించిన ఓ ఎపిసోడ్ కూడా విపరీతంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా.. నాటి కార్యక్రమానికి సంబంధించి బేర్ గ్రిల్స్ తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు.

మోదీ కోసం పడవ!.. ఏంకాదని చెప్పా..!కానీ... బేర్ గ్రిల్స్ వైరల్ పోస్ట్!

ఇంటర్నెట్ డెస్క్: బేర్ గ్రిల్స్..పరిచయం అక్కర్లేని పేరిది! మ్యాన్ వర్సెస్ వైల్డ్ పేరిట అరణ్యాల్లో ఆయన చేసే సాహసయాత్రలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్. ఆధునిక సౌకర్యాలకు దూరంగా అడువుల్లో, కొండకోనల్లో ఎలా బతకాలో నేర్పించే ఈ కార్యక్రమానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇండియాలోనూ బేర్ గ్రిల్స్‌కు లెక్కలేనంత మంది ఫ్యాన్స్! ఇక గతంలో ప్రధాని మోదీతో బేర్ గ్రిల్స్ నిర్వహించిన ఓ ఎపిసోడ్ కూడా విపరీతంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా.. నాటి కార్యక్రమానికి సంబంధించి బేర్ గ్రిల్స్ తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. మోదీ విషయంలో సీక్రెట్ సర్వీస్‌కు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయానంటూ ఆయన ఫేస్ బుక్‌లో రాసుకొచ్చారు.ఆ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర ఘటన గురించి వివరించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. 


‘‘నా ఫేవరెట్ ఫొటోల్లో ఇదీ ఒకటి.. డిస్కవరి జంగల్ సాహసయాత్ర తరువాత..నీళ్లలో పూర్తిగా తడిసిన మేమిద్దం ఇలా టీ తాగుతుండగా తీసిన ఫొటో.  బ్యాక్ గ్రౌండ్‌లో ఉన్న చిన్న పడవను గమనించారా...ఇద్దరు వ్యక్తులు కూర్చునేందుకు వీలుగా దాన్ని నేను తయారు చేశా. కానీ.. మోదీ ఎక్కగానే అది నిటిలో మునిగిపోయినంత పని చేసింది. ఇక లాభం లేదనుకుని.. నేను పక్కనే ఈదుకుంటూ వేళ్లా..!అయితే.. అంతకుమనుపే నేను భారత్ సీక్రెట్ సర్వీస్ అధికారులకు హామీ ఇచ్చా.. మోదీ అరికాలు కూడా తడవకుండా జాగ్రత్త పడతానని చెప్పా..! కానీ నేను అనుకున్నదానికి భిన్నంగా జరిగింది. అయితే.. అన్నింటి మధ్యా సమతుల్యం పాటించేదే ప్రకృతి అని నాటి ఘటనలు నాకు తరచూ గుర్తు చేస్తుంటాయి. మనకుండే బిరుదులు, మనధరించే మాస్కులకు ఆవల మనమందరం ఒకటే..! ఇక్కడ మేమిద్దరం.. జస్ట్ టీ తాగుతూ..చలికాచుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలో విడుదలకానున్న నా ఆటో బయోగ్రఫీ ‘నెవర్ గీవప్‌’లో ఇటువంటి ఆసక్తికర కథనాలు ఎన్నో ఉన్నాయి'' అని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. Updated Date - 2021-02-06T22:50:42+05:30 IST