తప్పక చూడాల్సిన వీడియో.. ఎయిర్‌పోర్ట్‌లో ఈ బుజ్జాయి ఏం చేసిందో చూడండి

ABN , First Publish Date - 2021-10-16T02:01:48+05:30 IST

మీ మనసులని దోచేసే వీడియో ఇది. ఓ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ అధికారి, ఓ చిన్నారి పాప మధ్య ఏదో సంభాషణ జరగడం ఈ వీడియోలో..

తప్పక చూడాల్సిన వీడియో.. ఎయిర్‌పోర్ట్‌లో ఈ బుజ్జాయి ఏం చేసిందో చూడండి

మీ మనసులని దోచేసే వీడియో ఇది. ఓ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ అధికారి, ఓ చిన్నారి పాప మధ్య ఏదో సంభాషణ జరగడం ఈ వీడియోలో గమనించవచ్చు. ఆయనను ఆ పాప ఏదో విషయంలో పర్మిషన్ అడుగుతోంది. ఈ వీడియో కతార్ ఎయిర్‌పోర్ట్‌లోనిది. అక్కడి ఓ సెక్యూరిటీ అధికారి దగ్గరకొచ్చిన ఓ పసిపాప .. మరికాసేపట్లో విమానంలో వెళ్లిపోతున్న తన ఆంటీని కలిసేందుకు పర్మిషన్ అడిగింది. తన చిట్టి చేత్తో ఆంటీని చూపించింది. సెక్యూరిటీ అధికారి వెళ్లమని చెప్పడంతో పరిగెత్తుకుంటూ వెళ్లి తన ఆంటీని కౌగలించుకుంది. ఆమెకు మనసారా గుడ్‌బై చెప్పింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.కప్తాన్ హిందూస్తాన్(Kaptan Hindustan) అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను చేయగా.. కొన్ని గంటల్లోనే ఏకంగా 40 వేల లైకులు వచ్చాయి. 10వేలకు పైగా ఈ వీడియోను రీట్వీట్ చేశారు. పాపను చూస్తే ముద్దొస్తోందని, ఇంత చిన్నవయసులోనే ఆమె పెద్దలకిచ్చే మర్యాద ఇవ్వడం చాలా గొప్ప విషయమని కామెంట్లు చేస్తున్నారు.Updated Date - 2021-10-16T02:01:48+05:30 IST