పురిటినొప్పులతో హాస్పటల్‌లో చేరిన మహిళ.. పుట్టిన బాబును చూసి షాకైన వైద్య సిబ్బంది.. లక్ష మందిలో ఒకరే ఇలా..

ABN , First Publish Date - 2021-12-30T22:36:02+05:30 IST

నెలలు నిండటంతో ఓ మహిళకు పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను దగ్గరలోని ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ వైద్య సిబ్బంది.. ఆమెకు పురుడు పోశారు. అనంతరం..

పురిటినొప్పులతో హాస్పటల్‌లో చేరిన మహిళ.. పుట్టిన బాబును చూసి షాకైన వైద్య సిబ్బంది.. లక్ష మందిలో ఒకరే ఇలా..

ఇంటర్నెట్ డెస్క్: నెలలు నిండటంతో ఓ మహిళకు పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను దగ్గరలోని ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ వైద్య సిబ్బంది.. ఆమెకు పురుడు పోశారు. అనంతరం.. పుట్టిన బాబును చూసి, వైద్య సిబ్బంది ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే దగ్గరలోని పెద్ద హాస్పటల్‌కు తీసుకెళ్లాలని సూచించారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇంతకూ విషయం ఏంటంటే..


బిహార్‌లోని పాట్నా ప్రాంతానికి చెందిన రహీనా అలీ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం రవీనా ఖాటూన్ అనే మహిళతో వివాహం జరిగింది. ఈ క్రమంలోనే వారికి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. తర్వాత మరోసారి గర్భందాల్చిన రవీనాకు గురువారం రోజు పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆమెను కుటుంబ సభ్యులు దగ్గరలోని ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ వైద్య సిబ్బంది.. రవీనాకు పురుడు పోశారు. అనంతరం పుట్టిన బిడ్డను చూసి షాకయ్యారు.బాబుకు నాలుగు కాళ్లు ఉండటంతో కంగుతిన్నారు. వెనకవైపు అదనంగా రెండు కాళ్లు ఉండటాన్ని చూసి విస్తుపోయారు. అంతేకాకుండా ఆ బాబును దగ్గరలోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించారు. దీంతో ఆ చిన్నారిని కుటుంబ సభ్యులు పెద్ద హాస్పటల్‌కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడిన వైద్యులు.. ప్రాథమిక చికిత్స చేస్తున్నట్టు చెప్పారు. అంతేకాకుండా లక్ష మందిలో ఒకరు మాత్రమే ఇలా పుడతారని వెల్లడించారు. జన్య సంబంధ కారణాల వల్ల పిల్లలు ఇలా పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. కాగా.. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశం అయింది. 
Updated Date - 2021-12-30T22:36:02+05:30 IST