పెట్రోలింగ్ వాహనం పక్కనే నకిలీ పోలీసులు... ఏం చేశారంటే...

ABN , First Publish Date - 2021-01-20T14:01:19+05:30 IST

బీహార్ రాజధాని పట్నాలో పోలీసు పెట్రోలింగ్ వాహనం పక్కనే చోరీ జరిగింది. హాజీపూర్ నుంచి...

పెట్రోలింగ్ వాహనం పక్కనే నకిలీ పోలీసులు... ఏం చేశారంటే...

పట్నా: బీహార్ రాజధాని పట్నాలో పోలీసు పెట్రోలింగ్ వాహనం పక్కనే చోరీ జరిగింది. హాజీపూర్ నుంచి పట్నా వచ్చిన ఒక వ్యక్తి రూ. 67 వేలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన గోలంబర్ సమీపంలో చోటుచేసుకుంది. అదే ప్రాంతంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఉంది. ఇదే మార్గంలో హాజీపూర్ నుంచి పాట్నాకు గణేష్ అనే బైక్‌పై వ్యక్తి వచ్చాడు. ఇంతలో అతనిని ఇద్దరు వ్యక్తులు అడ్డుకుని, లైసెన్స్ చూపించమన్నారు. ఇంతలో ఒక వ్యక్తి గణేశ్ జేబులను తడిమి చూశాడు. ఆ జేబులోని డబ్బులను బయటకు తీశాడు. అయితే గణేశ్ వారిని పోలీసులు అనుకుని, తనిఖీలకు అభ్యంతరం చెప్పలేదు. దీంతో వారిద్దరూ అ డబ్బు తీసుకుని పారిపోయారు. దీంతో విషయం గ్రహంచిన గణేష్ వెంటనే పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కేసు దర్యాప్తు చేస్తున్నారు.Updated Date - 2021-01-20T14:01:19+05:30 IST