ఆ మాజీ పోర్న్ స్టార్‌.. ఎంత దారుణానికి ఒడిగట్టింది..!

ABN , First Publish Date - 2021-10-07T22:11:58+05:30 IST

ఆమె ఒక మాజీ ఫోర్న్ స్టార్.. అనంతరం పెళ్లి చేసుకుని ఓ కొడుక్కి జన్మనిచ్చింది. భర్తతో విడిపోయి ప్రస్తుతం తన రెండేళ్ల కుమారుడు అలెక్స్‌తో కలిసి వేరుగా ఉంటోంది. విషయానికొస్తే.. ఇటలీలోని పెరిజియా ప్రాంతంలో ఉన్న ఓ సూపర్ మార్కెట్‌లో మాజీ ఫోర్న్ స్టార్ కటాలిన్ ఎర్జ్‌బెట్ బ్రాడాక్స్.. కుమారుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు.

ఆ మాజీ పోర్న్ స్టార్‌.. ఎంత దారుణానికి ఒడిగట్టింది..!

ఆమె ఒక మాజీ ఫోర్న్ స్టార్.. అనంతరం పెళ్లి చేసుకుని ఓ కొడుక్కి జన్మనిచ్చింది. భర్తతో విడిపోయి ప్రస్తుతం తన రెండేళ్ల కుమారుడు అలెక్స్‌తో కలిసి వేరుగా ఉంటోంది. విషయానికొస్తే.. ఇటలీలోని పెరిజియా ప్రాంతంలో ఉన్న ఓ సూపర్ మార్కెట్‌లో మాజీ ఫోర్న్ స్టార్ కటాలిన్ ఎర్జ్‌బెట్ బ్రాడాక్స్.. కుమారుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. మరోవైపు తన కుమారుడిని కాపాడాలంటూ ఆమె కేకలు పెడుతోంది. ఈలోగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడు.


సూపర్‌ మార్కెట్‌ పక్కన ఉన్న ఓ భవనంలో అలెక్స్‌కు సంబంధించిన రక్తపు టీషర్టు పోలీసులకు లభ్యమైంది. అలెక్స్‌ మృతదేహంపై 9 కత్తి పోట్లు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. కొడుకు అని కూడా చూడకుండా ఆ బాలుడిని మాజీ పోర్న్ స్టార్ కటాలిన్‌.. హత్య చేసిందని ఆమె మాజీ భర్త నార్బర్ట్‌.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కటాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల తనిఖీల్లో కటాలిన్ పర్స్‌లో కత్తి కనిపించింది. 


కటాలిన్‌తో విడిపోయిన తాను హంగేరిలో ఉంటున్నానని, తన కొడుకు కోసం న్యాయ పోరాటం చేస్తున్నానని నార్బర్ట్‌ తెలిపాడు. తన మీద కోపంతోనే అలెక్స్‌ను చంపిందని ఆరోపించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-07T22:11:58+05:30 IST