అమరావతిని అర్థాంతరంగా ఆపేసి ఏం ఉద్ధరించారు?

ABN , First Publish Date - 2021-08-04T01:02:01+05:30 IST

అమరావతిని అర్థాంతరంగా ఆపేసి ఏం ఉద్ధరించారు?

అమరావతిని అర్థాంతరంగా ఆపేసి ఏం ఉద్ధరించారు?

అమరావతి: ఏపీలో అమరరాజా బ్యాటరీస్ తమిళనాడుకు తరలిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ కంపెనీ నిర్వాహకులు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. చిత్తూరు జిల్లా కరకంబాడిలో ఉన్న ఈ కంపెనీని.. తమిళనాడులో ఏర్పాటు చేసేందుకు భూమి కావాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ను అమరరాజా నిర్వాహకులు కలిశారు. దీంతో ఆయన ఓకే  చెప్పారు. భూమి కూడా కేటాయించినట్లు సమాచారం. మరో మూడు నెలల్లోనే అమరరాజా బ్యాటరీస్‌ను తమిళనాడులో ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు చర్యలు చేపట్టారు. ఈ కంపెనీ తరలిపోవడంతో వేలాది మంది కార్మికులకు ఉపాధి పోయే అవకాశం ఉంది. గతంలో కొన్ని కంపెనీలు ఏపీ నుంచి తరలివెళ్లిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఈ నేపథ్యంలో అమరరాజా బ్యాటరీస్ కూడా వెళ్లిపోతే భారీగా ఆదాయం తగ్గే అవకాశం ఉందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏపీకి మూడు రాజధానులని చెప్పి ఆ ప్రాంతాల్లో ఒక్క అభివృద్ధి పనిని కూడా ప్రారంభించలేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. 


ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ‘‘మూడు రాజధానులతో సమగ్రాభివృద్ధి అని ఎందుకు చెప్పారు?. అమరావతిని అర్థాంతరంగా ఆపేసి రాష్ట్రాన్ని ఏం ఉద్ధరించారు?. విశాఖను చెరబట్టి ఉత్తరాంధ్రకు ఏం ఒరగబెట్టారు?. పరిశ్రమలను వెళ్లగొడుతూ రాయలసీమను ఎందుకు నాశనం చేస్తున్నారు?. ఇదేనా జగనన్న సూత్రీకరించిన సర్వతోముఖాభివృద్ధి?. ఇందుకేనా ఒక్కఛాన్స్ ఒక్కఛాన్స్ అంటూ?. అడుక్కున్నది?..’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు
Updated Date - 2021-08-04T01:02:01+05:30 IST