అక్కడ అసంతృప్తితో రగిలిపోతూ, ఉద్యోగాలు మానేస్తున్నవారు ప్రతీకారంగా ఏం చేస్తున్నారంటే..

ABN , First Publish Date - 2021-12-19T14:22:09+05:30 IST

అమెరికాలో వివిధ కారణాలతో అసంతృప్తికి గురై..

అక్కడ అసంతృప్తితో రగిలిపోతూ, ఉద్యోగాలు మానేస్తున్నవారు ప్రతీకారంగా ఏం చేస్తున్నారంటే..

అమెరికాలో వివిధ కారణాలతో అసంతృప్తికి గురై ఉద్యోగాలను మానేస్తున్నవారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అయితే ఇటువంటి సందర్బాల్లో పలువురు ఉద్యోగులు సోషల్ మీడియాలో.. తాము ఉద్యోగం మానివేయడం వెనుకగల కారణాలను తెలియజేస్తున్నారు. తాను ఉద్యోగంలో చేరిన తర్వాత తన మానసిక పరిస్థితి మరింతగా దిగజారిందని ఒక ఉద్యోగి వెల్లడించగా, మరొకరు జీతం గురించి ప్రస్తావిస్తూ, సహోద్యోగికి అధిక జీతం ఇస్తున్న కారణంగా తాను అసంతృప్తికి గురవుతున్నానని పేర్కొన్నారు. ఎవరైనాసరే.. ఏదో ఒక కారణంతో ఉద్యోగాన్ని వదిలివేయాలనుకుంటే తమ అభిప్రాయాలను ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, టిక్‌టాక్‌లలో తమ ఫాలోవర్లకు తెలియజేయాలని పలువురు కోరుతున్నారు. అమెరికాలో ఉద్యోగాలను స్వచ్ఛందంగా మానేస్తున్నవారి సంఖ్య అధికంగా ఉంటోంది. ఈ ఏడాదిలో గత సెప్టెంబర్‌ నాటి వరకు మూడు శాతం మంది ఉద్యోగాలు వదిలేశారు. వీరు reddit ఫోరమ్ r లేదా antiworksలో తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఈ ఏడాది ఈ వెబ్‌సైట్ల యూజర్ల సంఖ్య మరింతగా పెరిగింది.


అమెరికాలో ఉద్యోగం మానివేస్తున్నవారు తాము తమ బాస్‌కు పంపిన రాజీనామా పత్రాన్ని స్క్రీన్‌షాట్‌ తీసి, ట్వీట్ చేస్తున్నారు. వివిధ కంపెనీలలోని ఉన్నతోద్యోగులు కూడా ఇటువంటి రాజీనామా పత్రాలను బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. తాము ఉద్యోగం నుంచి నిష్క్రమించాలనే నిర్ణయాన్ని బహిరంగపరచడం తెలివైన పనిగా వారు భావిస్తున్నారు. అయితే కొందరు ఉద్యోగులు ఇటువంటి సందర్భాలలో యజమానిని ఆన్‌లైన్‌లో అవమానించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమెరికాలో ఉద్యోగాలు మానేస్తున్నవారు  అందుకు కారణాలుగా.. కరోనా మహమ్మారి, నల్లజాతీయుల పట్ల వివక్ష, వ్యక్తిగత, సామాజిక తిరుగుబాటు మొదలైనవి కారణాలుగా చెబుతున్నారు. మరోవైపు అమెరికాలోని వివిధ సంస్థలలో ఉద్యోగాలకు డిమాండ్ మరింతగా పెరిగింది. దీనిని చూసుకునే ఉన్న ఉద్యోగాన్ని మానివేసి వేరే ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నవారి సంఖ్య కూడా పెరిగింది.  ఉద్యోగాలు మానివేస్తున్నవారికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్‌లు ఈ ఏడాదిలో 22.9 శాతానికి పెరిగాయి. 2020లో ఇది 12.8 శాతంగా ఉంది. యుఎస్‌లోని పలు ప్రాంతాలలో ఉద్యోగావకాశాలు- ఉద్యోగార్ధుల సంఖ్య మధ్య భారీ అంతరం ఉంది. ఉదాహరణకు నెబ్రాస్కా ప్రాంతంలో 69 వేల ఉద్యోగ ఖాళీలు ఉండగా, ఇక్కడ అందుబాటులో ఉన్న ఉద్యోగుల సంఖ్య 19,300గా ఉంది.Updated Date - 2021-12-19T14:22:09+05:30 IST