మేనల్లుడని ఇంటికి పిలిస్తే అత్తతో అక్రమ సంబంధం.. రోజూ దొంగచాటుగా రాసలీలలు.. మేనమామ చూసేసరికి..

ABN , First Publish Date - 2021-12-04T21:52:05+05:30 IST

తండ్రిలాంటి మేనమామ భార్యపైనే కన్నేశాడో మేనల్లుడు. హర్యానాలో జరిగిన ఈ ఘటన.. నేటి మానవ సంబంధాలు ఎంతకు దిగజారిపోతున్నాయో అనే దానికి నిదర్శనంగా నిలుస్తోంది..

మేనల్లుడని ఇంటికి పిలిస్తే అత్తతో అక్రమ సంబంధం.. రోజూ దొంగచాటుగా రాసలీలలు.. మేనమామ చూసేసరికి..
ప్రతీకాత్మక చిత్రం

మేనమామ అంటే తండ్రి తర్వాత తండ్రి అని అంటారు. అందుకే మేనల్లుడిపై మేనమామకు ఎంతో అభిమానం ఉంటుంది. తోడబుట్టిన చెల్లెలు లేదా అక్క పిల్లలను.. మేనమామలు ఎంతో గారాబంగా చూసుకుంటూ ఉంటారు. అయితే మేనళ్లుల్లు కూడా అదే స్థాయిలో వారిపై గౌరవం చూపిస్తారనేది అత్యాశే అవుతుంది. తండ్రిలాంటి మేనమామ భార్యపైనే కన్నేశాడో మేనల్లుడు. హర్యానాలో జరిగిన ఈ ఘటన.. నేటి మానవ సంబంధాలు ఎంతకు దిగజారిపోతున్నాయో అనే దానికి నిదర్శనంగా నిలుస్తోంది. మేనల్లుడని రోజూ ఇంటికి పిలిస్తే.. అత్తపైనే కన్నేశాడు. మందలించాల్సిన అత్త కూడా మేనల్లుడితో వివాహేతర సంబంధానికి అంగీకరించింది. వివరాల్లోకి వెళితే.. 


హర్యానాలోని పాల్వాల్‌ పరిధి హోడల్ ప్రాంతంలో తారాచంద్, అర్చన దంపతులు నివాసం ఉంటున్నారు. తారాచంద్‌కు మహేష్ అనే సోదరుడు, ఓ సోదరి ఉన్నారు. తారాచంద్, మహేష్‌కు తమ సోదరి అంటే ఎనలేని అభిమానం. అలాగే సోదరి కొడుకు కృష్ణకుమార్‌ను కూడా మేనమామలు ఇద్దరూ.. ఎంతో గారాబంగా చూసుకునేవారు. కృష్ణకుమార్‌ తరచూ తన పెద్ద మేనమామ అయిన తారాచంద్ ఇంటికి వెళ్తూ ఉండేవాడు. తారాచంద్ పని మీద బయటికెళ్లే సమయంలో తన అత్తతో చనువుగా ఉండేవాడు. ఆమె కూడా కృష్ణకుమార్ పట్ల అభిమానం చూపించేది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. కొన్నాళ్లకు ఈ అభిమానం కాస్త, అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇది తప్పు అని మందలించాల్సిన అత్త కూడా.. కృష్ణకుమార్‌‌పై మనసు పడి, అతడిపై ప్రేమ పెంచుకుంది.


గతంలో మేనమామ తారాచంద్ ఉన్నప్పుడు ఇంటికి వెళ్లే కృష్ణకుమార్.. అక్రమ సంబంధానికి అలవాటు పడ్డాక, తారాచంద్ లేని సమయంలో మాత్రమే వెళ్లేవాడు. ఇలా రోజూ అత్తతో దొంగచాటుగా రాసలీలలు సాగించేవాడు. అక్రమ సంబంధాలు ఎన్నో రోజులు సాగవన్నట్లు.. ఓ రోజు మేనమామకు అనుమానం కలిగింది. తను ఇంట్లో లేని సమయంలోనే మేనల్లుడు రావడం, మరోవైపు భార్య ప్రవర్తనలో మార్పులు రావడం గమనించాడు. అన అనుమానం నిజమని తేలడంతో భార్యను గట్టిగా మందలించాడు. కొన్నాళ్లు బాగున్న భార్య.. తర్వాత మళ్లీ యథావిధిగా కృష్ణకుమార్‌తో రాసలీలలు కొనసాగించేది. దీంతో భార్యను మరింత గట్టిగా మందలించి, పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు.


తన భర్త బతికుంటే తన అక్రమ సంబంధానికి అడ్డొస్తాడని, ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకుంది. రూ.16,000 ఖర్చు చేసి నాటు తుపాకీ కొనుగోలు చేసింది. కృష్ణకుమార్‌కు ఇచ్చి, మేనమామను చంపమని చెప్పింది. అక్టోబర్ 8న తారాచంద్, కృష్ణకుమార్ కలిసి బైక్‌లో నగరంలోని రోజ్ నర్సింగ్ హోమ్‌లో పనికి వెళ్లారు. మధ్యలో బండిని ఆపించిన కృష్ణకుమార్.. ఒక్కసారిగా మేనమామపై కాల్పులు జరిపి పారిపోయాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు మహేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ ప్రారంభించగా అసలు నిజం బయటపడింది. కృష్ణకుమార్, అర్చనను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2021-12-04T21:52:05+05:30 IST