మనుషుల పుర్రెలు, ఎముకలను అమ్మేస్తాడట.. కొనాలంటే సంప్రదించండి.. అంటున్న ఓ కుర్రాడి వీడియో వైరల్..

ABN , First Publish Date - 2021-10-20T21:51:51+05:30 IST

అమెరికాకు చెందిన 21 ఏళ్ల జాన్‌-పిచయా ఫెర్రీ అనే టిక్‌టాకర్‌కు 5లక్షల ఫాలోవర్స్ ఉన్నారు.దీంతో ఐడియా సర్‌జీ.. అంటూ ఓ వ్యాపారం ప్రారంభించాడు. ఇందుకోసం న్యూయార్క్‌ నగరంలో ఓ కంపెనీ ప్రారంభించాడు.

మనుషుల పుర్రెలు, ఎముకలను అమ్మేస్తాడట.. కొనాలంటే సంప్రదించండి.. అంటున్న ఓ కుర్రాడి వీడియో వైరల్..

సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరిగే కొద్దీ.. ఇక వారు పబ్లిక్ ఫిగర్ జాబితాలోకి చేరిపోతుంటారు. వెంటనే పలు కంపెనీలు వారిని వెంటపడతాయి. తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకునేందుకు ఎగబడుతూ ఉంటాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా .. కొందరు దీన్ని అవకాశంగా తీసుకుని, బాగా డబ్బు సంపాదిస్తుంటారు. మరికొందరు సొంతంగా వ్యాపారం ప్రారంభించి.. తమ ఉత్పత్తులకు తామే ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఇలాగే అమెరికాలో ఓ యువకుడికి వినూత్న ఆలోచన వచ్చింది. ఇంకేముంది అతడి వ్యాపారంపై నెట్టింట పెద్ద చర్చే నడుస్తోంది.. వివరాల్లోకి వెళితే..


అమెరికాకు చెందిన 21 ఏళ్ల జాన్‌-పిచయా ఫెర్రీ అనే టిక్‌టాకర్‌కు 5లక్షల ఫాలోవర్స్ ఉన్నారు.దీంతో ఐడియా సర్‌జీ.. అంటూ ఓ వ్యాపారం ప్రారంభించాడు. ఇందుకోసం న్యూయార్క్‌ నగరంలో ఓ కంపెనీ ప్రారంభించాడు. మనుషుల ఎముకలు, పుర్రెలను అమ్ముతున్నట్లు ప్రకటించాడు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనికి నెటిజన్ల నంచి పెద్ద స్పందనే వచ్చింది. ఈ వీడియోలు దారుణంగా ఉన్నాయంటూ కొందరు కామెంట్ చేస్తున్నా.. చాలా మంది నుంచి మద్దతు లభిస్తోంది.


వివిధ శ్మశానాల నుంచి సేకరించిన మనిషి పర్రెలు, ఎములను ప్రదర్శనగా పెడుతుంటాడు. అలాగే ఎముకల నిర్మాణం, పుర్రెలోని భాగాలు, దంతాలు, ఎముకల అంతర్గత నిర్మాణంపై అవగాహన కల్పిస్తూ ఉంటాడు. అనంతరం వాటిని విక్రయిస్తూ ఉంటాడు. ఇందు కోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను కూడా నడుపుతున్నాడు. మన దేశంలో ఇది తప్పేమో గానీ.. అమెరికాలో మాత్రం అక్రమమేమీ కాదట. కళాకారులు, కీళ్ల నిపుణులు, విశ్వవిద్యాలయాల నిర్వాహకులకు.. పుర్రెలను పంపుతుంటానని ఆ యువకుడు చెబుతున్నాడు. గుర్తుతెలియని శవాల నుంచి వీటిని సేకరిస్తూ ఉంటారు.Updated Date - 2021-10-20T21:51:51+05:30 IST