ఎప్పటిలా కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేశాడు.. అదికాస్తా వర్కవుట్ కావడంతో రూ.74లక్షలు ఇంట్లో వచ్చిపడ్డాయి!

ABN , First Publish Date - 2021-10-31T22:10:31+05:30 IST

ఓ వ్యక్తి స్థానికంగా పని చేసుకుంటూ.. వచ్చిన డబ్బుతో జీవితం గడిపేవాడు. తాను సంపాదించే డబ్బు.. తన అవసరాలకే సరిపోకపోవడంతో చిన్న చిన్న కొరికలను అతడు ఎప్పుడూ వాయిదా వేసుకుంటూ ఉండేవాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం అతడు

ఎప్పటిలా కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేశాడు.. అదికాస్తా వర్కవుట్ కావడంతో రూ.74లక్షలు ఇంట్లో వచ్చిపడ్డాయి!

ఇంటర్నెట్ డెస్క్: ఓ వ్యక్తి స్థానికంగా పని చేసుకుంటూ.. వచ్చిన డబ్బుతో జీవితం గడిపేవాడు. తాను సంపాదించే డబ్బు.. తన అవసరాలకే సరిపోకపోవడంతో చిన్న చిన్న కొరికలను అతడు ఎప్పుడూ వాయిదా వేసుకుంటూ ఉండేవాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం అతడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఎలాగైనా పెద్ద మొత్తంలో డబ్బును సంపాదించాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగానే.. కొన్ని రోజులుగా లాటరీ టికెట్లను కొనుగోలు చేస్తూ వస్తూన్నాడు. అయితే ఆయనకు ప్రతిసారి నిరాశే ఎదురైంది. అయితే ఈ సారి కొత్తగా ట్రై చేశాడు. అదికాస్తా వర్కవుట్ కావడంతో లక్షధికారి అయ్యాడు. కాగా.. ఇంతకూ కొత్తగా ఆయన ఏం ట్రై చేశాడు అనేగా మీ సందేహం.. అక్కడికే వెళ్దాం పదండి..అమెరికాలోని వర్జినియాకు చెందిన విలియం న్యూవెల్ అనే వ్యక్తి చిన్నపాటి ఉద్యోగం చేసేవాడు. వచ్చే జీతంతో అవసరాలను తీర్చుకునేవాడు. రొటీన్‌గా మారిన జీవితంపై విరక్తి చెందిన అతడు.. ఓ రోజు కీలక నిర్ణయం తీసుకున్నాడు. లాటరీ కొని, గెలుచుకున్న డబ్బులతో చిన్న చిన్న కోరికలను తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా అతడు తన దగ్గర్లో ఉన్న స్టోర్‌లో లాటరీ టికెట్లను కొనుగోలు చేస్తున్నాడు. అయితే ప్రతిసారి విలియంకు నిరాశే ఎదురైంది. దీంతో అక్టోబర్ 23 కొత్తగా ట్రై చేశాడు. స్టోర్‌లో కొనకుండా.. ఆన్‌లైన్‌లో 20 లాటరీ టికెట్లను కొనుగోలు చేశాడు. కాగా.. తాజాగా లాటరీ నిర్వాహకులు డ్రా తీశారు.


అందులో అదృష్టం విలియంను వరించింది. అతడు కొన్న ప్రతి లాటరీ టికెట్‌‌ 5వేల డాలర్లు తగలడంతో ఏకంగా విలియం ఏకంగా రూ.74లక్షల (1,00,000 డాలర్లు)కు అధిపతి అయ్యాడు. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ వార్త స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇదిలా ఉంటే.. ఏడాది క్రితం ఇటువంటి ఘటననే వర్జినీయాలో చోటు చేసుకుంది. రేమండ్ అనే వ్యక్తి.. 25 లాటరీ టికెట్లను కొనుగోలు చేయగా.. ఆయనకు కూడా ప్రతి టికెట్‌‌నై 5వేల డార్లను గెలుచుకున్నాడు. 
Updated Date - 2021-10-31T22:10:31+05:30 IST