పురుషుల కోసం వయాగ్రా ఉన్నట్టుగానే.. స్త్రీల కోసం కూడా ఓ కొత్త ఔషధం రెడీ.. అది ఎలా పనిచేస్తుందంటే..!

ABN , First Publish Date - 2021-09-03T18:28:53+05:30 IST

పురుషులతో పోల్చుకుంటే మహిళలకు లైంగికానందం చాలా తక్కువని ఎన్నో సర్వేలు చెబుతున్నాయి.

పురుషుల కోసం వయాగ్రా ఉన్నట్టుగానే.. స్త్రీల కోసం కూడా ఓ కొత్త ఔషధం రెడీ.. అది ఎలా పనిచేస్తుందంటే..!

పురుషులతో పోల్చుకుంటే మహిళలకు లైంగికానందం చాలా తక్కువని ఎన్నో సర్వేలు చెబుతున్నాయి. చాలా తక్కువ మంది మహిళలు మాత్రమే తరచుగా భావప్రాప్తి పొందుతున్నారని పలు సర్వేలు ఇప్పటికే వెల్లడించాయి. శృంగారం పట్ల అనాసక్తి, జీవనశైలిలో వచ్చిన మార్పులు, ఒత్తిడి, నిద్రలేమి, ఆరోగ్య సమస్యలు మహిళలకు లైంగిక ఆనందాన్ని దూరం చేస్తున్నాయి. ఇవే సమస్యలు పురుషులకు ఎదురైతే వయాగ్రా రూపంలో వారికి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే మహిళల వయాగ్రా గురించి కూడా దాదాపు 20 ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని అందుబాటులోకి వచ్చినా వాటి పనితీరు అంతంత మాత్రమే. 


తాజాగా అమెరికాకు చెందిన వెల్లా బయోసైన్స్ కంపెనీ మహిళల కోసం వయగ్రాను రూపొందించింది. అయితే పురుషుల వయాగ్రా మాదిరిగా ఇది మాత్రల రూపంలో ఉండదు. క్రీమ్ రూపంలో ఉంటుంది. దీనిని మహిళలు శృంగారానికి ముందు తమ జననేంద్రియాల వద్ద రాసుకోవాలి. ఫలితంగా అక్కడి రక్తనాళాలు ఉత్తేజితమై జననేంద్రియాలకు రక్త సరఫరా పెరుగుతుంది. ఫలితంగా శృంగార ఉద్ధీపనలు కలుగుతాయని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రతి ముగ్గురిలో ఇద్దరు మహిళలు ఈ వయాగ్రా వల్ల శృంగారాన్ని అనందిస్తున్నట్టు తమ అధ్యయనంలో తేలిందన్నారు. మాత్రల రూపంలో శరీరంలోకి తీసుకునే అవసరం లేకపోవడం వల్ల ఈ వయాగ్ర ఎలాంటి దుష్ప్రభావాలనూ కలిగించదని తెలిపారు. 

Updated Date - 2021-09-03T18:28:53+05:30 IST