ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోను.. తేల్చిచెప్పిన వరుడు.. కారణమేంటని నిలదీస్తే వాట్సప్‌లో మెసేజ్‌ను చూపించి..
ABN , First Publish Date - 2021-08-05T21:45:58+05:30 IST
మరికొద్ది గంటల్లో పెళ్లి.. ఆ సమయంలో వధువు కుటుంబానికి వరుడు షాకిచ్చాడు..
మరికొద్ది గంటల్లో పెళ్లి.. ఆ సమయంలో వధువు కుటుంబానికి వరుడు షాకిచ్చాడు.. ఆ పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పాడు.. కారణమేంటని నిలదీస్తే తన ఫోన్లోని వాట్సాప్ ఫొటోలను, వీడియోలను చూపించాడు.. వధువుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఉండడంతో అందరూ ఆశ్చర్యపోయారు.. వెంటనే పోలీసులను ఆశ్రయించారు.. బీహార్‌లోని సీతామర్హి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
సీతామర్హికి చెందిన రామ్‌దేవ్ అనే వ్యక్తి తన మరదలితో ప్రేమాయణం సాగించాడు. ఆమె కూడా అతడిని ప్రేమించింది. అతడితో సన్నిహితంగా మెలిగింది. అయితే తల్లిదండ్రుల బలవంతం మేరకు రామ్‌దేవ్‌ను కాకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించింది. దీంతో రామ్‌దేవ్ కసి పెంచుకున్నాడు. ఫోన్ చేసి ఆ పెళ్లి చేసుకోవద్దని బెదిరించాడు. అయినా ఆమె మాట వినకపోవడంతో.. ఆమె తనతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయినా ఆ పెళ్లి ఆగలేదని తెలుసుకున్నాడు.
పెళ్లి రోజు ఆ ఫొటోలను, వీడియోలను నేరుగా వరుడికే పంపించాడు. వాటిని చూసిన వరుడు ఆ పెళ్లిని రద్దు చేసుకున్నాడు. దీంతో వధువు తల్లిదండ్రులు, బంధువులు బుధవారం పోలీసులను ఆశ్రయించి రామ్‌దేవ్ మీద కేసు పెట్టారు. తన కూతురికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని వధువు తండ్రి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న రామ్‌దేవ్ గురించి వెతుకుతున్నారు.