ఆఫ్రికా యువకుడు.. 14వ ఫ్లోర్ నుంచి దూకేస్తానని బెదిరింపులు.. కాపాడిన పోలీసులకు షాకిచ్చాడు!

ABN , First Publish Date - 2021-07-12T20:06:26+05:30 IST

అది గ్రేటర్ నొయిడాలోని నిర్మాణంలో ఉన్న భారీ భవనం..

ఆఫ్రికా యువకుడు.. 14వ ఫ్లోర్ నుంచి దూకేస్తానని బెదిరింపులు.. కాపాడిన పోలీసులకు షాకిచ్చాడు!

అది గ్రేటర్ నొయిడాలోని నిర్మాణంలో ఉన్న భారీ భవనం.. ఆ భవనం 14వ అంతస్థు ఎక్కిన ఆఫ్రికా యువకుడు అక్కడి నుంచి దూకి చనిపోవాలనుకున్నాడు.. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.. అక్కడకు చేరుకున్న పోలీసులు ఎన్నో అష్టకష్టాలు పడి అతడిని ఎలాగోలా కిందకు తీసుకొచ్చారు.. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావని ప్రశ్నించిన పోలీసులు అతని సమాధానం విని నివ్వెరపోయారు.


ఆఫ్రికాకు చెందిన ఆంటోనీ మువై గ్రేటర్ నొయిడాలో నివసిస్తున్నాడు. ఆత్మహత్య చేసుకునేందుకు ఆదివారం గ్రేటర్ నొయిడా సెక్టర్-2లో నిర్మాణంలో ఉన్న భారీ భవనం 14వ అంతస్థుకు చేరుకున్నాడు. అతడిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు అతడిని కిందకు తీసుకొచ్చేందుకు ఎన్నో పాట్లు పడ్డారు. కొన్ని గంటల పాటు ఆంటోనీ, పోలీసుల మధ్య హైడ్రామా నడిచింది. చివరకు ఆంటోనీని కిందకు దింపారు. 


పోలీస్ స్టేషన్‌కు తరలించి ఆత్మహత్య చేసుకోవాలనుకోవడానికి గల కారణమేంటని ఆరా తీశారు. తన గాళ్‌ఫ్రెండ్‌తో తనకు చిన్న గొడవ జరిగిందని, అందుకే చనిపోవాలనుకున్నానని చెప్పాడు. దీంతో షాకైన పోలీసులు అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. 


Updated Date - 2021-07-12T20:06:26+05:30 IST