వ్యాపారంలో లాభాల కోసం యువతి మాస్టర్ ప్లాన్.. హాట్ హాట్ డ్రస్సులతో ఫోజులు.. క్యూ కడుతున్న కస్టమర్లు..

ABN , First Publish Date - 2021-12-03T01:24:23+05:30 IST

థాయ్‌లాండ్‌లో నర్సింగ్ చదువుతున్న ఓ యువతి తన వ్యాపారాన్ని పెంచుకునేందుకు వినూత్నంగా ఆలోచించింది. సెలబ్రిటీతో ప్రారంభించే కంటే తనే సెలబ్రిటీగా మారితే ఎలా ఉంటుందని ఆలోచించింది..

వ్యాపారంలో లాభాల కోసం యువతి మాస్టర్ ప్లాన్.. హాట్ హాట్ డ్రస్సులతో ఫోజులు.. క్యూ కడుతున్న కస్టమర్లు..

వ్యాపారాల్లో లాభాలు గడించేందుకు చాలామంది వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తుంటారు. ఇంకొందరైతే సెలబ్రిటీలతో వ్యాపారాన్ని ప్రారంభించి, తద్వారా అధిక ఆదాయం పొందుతుంటారు. అయితే థాయ్‌లాండ్‌లో నర్సింగ్ చదువుతున్న ఓ యువతి తన వ్యాపారాన్ని పెంచుకునేందుకు వినూత్నంగా ఆలోచించింది. సెలబ్రిటీతో ప్రారంభించే కంటే తనే సెలబ్రిటీగా మారితే ఎలా ఉంటుందని ఆలోచించింది. వెంటనే ఆచరణలోకి దిగింది. తన డ్రస్సింగ్ స్టైల్‌నే మార్చేసింది. దీంతో ప్రస్తుతం హోటల్‌కు కస్టమర్లు క్యూ కడుతున్నారు.


థాయ్‌లాండ్‌లో ఆలివ్ అరణ్య అపిస్సో అనే యువతి(23) నర్సింగ్ చదువుతోంది. ఓ వైపు చదువుతూనే మరోవైపు పాన్ కేక్‌లు తయారు చేస్తూ ఉంటుంది. అయితే మొదట్లో కస్టమర్లు మాత్రం అంతంతమాత్రంగానే వస్తుండేవారు. దీంతో ఆమెకు తీవ్రంగా నష్టాలు వచ్చేవి. రోజూ ఇలా నష్టాలు వస్తుండడంతో... ఎలాగైనా తన వ్యాపారాన్ని లాభాల్లోకి తేవాలని భావించి, వివిధ రకాలుగా ఆలోచించింది. చివరగా ఆమెకు ఓ ఐడియా వచ్చింది. తానే ఓ సెలబ్రిటీగా మారి, హాట్ హాట్ డ్రస్సులు వేస్తూ వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి, వెంటనే రంగంలోకి దిగింది.


తన ఎద అందాలు కనిపించేలా డ్రస్సులు వేస్తూ.. కేకులు తయారు చేయడం ప్రారంభించింది. ఇంకేముంది.. ఆనోటా ఈనోటా ఈ విషయం అందరికీ తెలిసింది. దీంతో కస్టమర్లు హోటల్‌కు క్యూ కట్టడం ప్రారంభించారు. ఆమె అందాలను వీక్షిస్తూ కేకులు తినడం మొదలెట్టారు. అంతటితో ఆగకుండా పోతూ పోతూ ఆమెతో సెల్ఫీలు కూడా దిగుతున్నారు. ఈ దెబ్బతో ఆ యువతి కొద్ది నెలల్లోనే సెలబ్రిటీగా మారిపోయింది. అయితే స్థానికులు కొందరు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆమెకు నచ్చజెప్పి, మరోసారి ఇలాంటి డ్రస్సులు వేయొద్దని చెప్పి వెళ్లిపోయారు. అయితే ఈమె గురించి తెలుసుకున్న నెటిజన్లు మాత్రం.. వాటెన్ ఐడియా.. సర్‌జీ.. అంటూ పొగుడుతున్నారు.

Updated Date - 2021-12-03T01:24:23+05:30 IST