15 రోజుల క్రితం పెళ్లి.. గాఢ నిద్రలో భర్త.. అర్ధరాత్రి ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిచి.. ఆ నవ వధువు చేసిన దారుణమిది..!

ABN , First Publish Date - 2021-07-12T18:17:05+05:30 IST

పదిహేను రోజుల క్రితమే పెళ్లి చేసుకుని అత్తంటి అడుగుపెట్టింది..

15 రోజుల క్రితం పెళ్లి.. గాఢ నిద్రలో భర్త.. అర్ధరాత్రి ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిచి.. ఆ నవ వధువు చేసిన దారుణమిది..!

పదిహేను రోజుల క్రితమే పెళ్లి చేసుకుని అత్తంటి అడుగుపెట్టింది.. మరో వ్యక్తికి భార్యగా మారినప్పటికీ తన ప్రేమికుడిని మర్చిపోలేకపోయింది.. దీంతో ప్రియుడిని తన అత్తింటికి పిలిపించి దారుణానికి ఒడిగట్టింది.. నిద్రపోతున్న భర్తను అత్యంత కిరాతకంగా చంపించింది.. మధ్యప్రదేశ్‌లోని విదిశాలో ఈ ఘటన ఆదివారం జరిగింది. 


విదిశాకు చెందిన కృష్ణా బాయ్ అనే యువతి పదిహేను రోజుల క్రితం సోను అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. అయితే అప్పటికే ఆమె శుభమ్ అనే యువకుడితో ఆరేళ్ల నుంచి ప్రేమలో ఉంది. పెద్దల కుదిర్చిన పెళ్లికి అంగీకరించి సోనును పెళ్లి చేసుకున్నప్పటికీ తన ప్రియుడు శుభమ్‌ను మర్చిపోలేకపోయింది. దీంతో తన భర్తను అడ్డు తప్పించుకోవాలనుకుంది. ఈ నెల ఆరో తేదీన తన అత్తింట్లోని వారందరూ నర్మదా నదిలో స్నానానికి వెళ్తున్నారని తెలిసి ప్రియుడు శుభమ్‌ను అత్తింటికి పిలిపించింది. 


తన భర్త నిద్రపోయిన తర్వాత శుభమ్‌ను బెడ్రూమ్‌లోకి తీసుకెళ్లింది. అక్కడ నిద్రపోతున్న సోనూ రెండు చేతులను కృష్ణా బాయ్ పట్టుకోగా.. శుభమ్ అతని తలను గొడ్డలితో నరికేశాడు. ఆ తర్వాత తనకేమీ తెలియనట్టు ఊరు వెళ్లిపోయాడు. అయితే కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించిన పోలీసులు కృష్ణా బాయ్ మొబైల్ డేటా ఆధారంగా శుభమ్‌ను అరెస్ట్ చేశారు. అక్కడ తమదైన శైలిలో విచారించగా అతను అసలు విషయం చెప్పేశాడు. దీంతో పోలీసులు కృష్ణా బాయ్‌ను, శుభమ్‌ను అరెస్ట్ చేశారు. Updated Date - 2021-07-12T18:17:05+05:30 IST