ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయని తల్లి.. అర్ధరాత్రి నేరుగా ఇంటికి వెళ్లిన కొడుకు.. తాళం తీసి లోపలకు వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2021-10-20T20:43:56+05:30 IST

ప్రతి రోజూ రాత్రి తన తల్లికి ఫోన్ చేసి.. ఆమె యోగక్షేమాలు అడగటం అతడికి అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా అతడు తన తల్లికి ఫోన్ చేశాడు. ఎప్పుడూ రెండు మూడు సార్లు రింగ్ కాగానే.. ఫోన్ లిఫ్ట్ చేసే ఆమె.. ఆ రోజు మాత్రం ఫోన్ ఎత్తలేదు. ఈ క్రమంలో అతడు అదే పనిగా తన తల్లికి ఫోన్ చేశాడు. అయితే అతడికి నిరాశే ఎదురైంది. దీంతో కంగారుపడ్డ అతడు.. వెంటనే తన తల్లి ఉం

ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయని తల్లి.. అర్ధరాత్రి నేరుగా ఇంటికి వెళ్లిన కొడుకు.. తాళం తీసి లోపలకు వెళ్లి చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి రోజూ రాత్రి తన తల్లికి ఫోన్ చేసి.. ఆమె యోగక్షేమాలు అడగటం అతడికి అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా అతడు తన తల్లికి ఫోన్ చేశాడు. ఎప్పుడూ రెండు మూడు సార్లు రింగ్ కాగానే.. ఫోన్ లిఫ్ట్ చేసే ఆమె.. ఆ రోజు మాత్రం  ఫోన్ ఎత్తలేదు. ఈ క్రమంలో అతడు అదే పనిగా తన తల్లికి ఫోన్ చేశాడు. అయితే అతడికి నిరాశే ఎదురైంది. దీంతో కంగారుపడ్డ అతడు.. వెంటనే తన తల్లి ఉంటున్న ప్రాంతానికి చేరుకున్నాడు. అనంతరం బయట నుంచి గడియపెట్టి ఉన్న తలుపులను చూసి అతడు షాకయ్యాడు. ఈ టైంలో తన తల్లి ఎక్కడికి వెళ్లుంటుంది అని అనుకుంటూనే తలుపులను ఓపెన్ చేశాడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లిన ఆ వ్యక్తి.. తన తల్లి గదిలో కనిపించిన దృశ్యాలను చూసి కంగుతిన్నాడు. వెంటనే పరుగెత్తుకెంటూ బయటికొచ్చాడు. విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలిపాడు. అనంతరం ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..చత్తీస్‌గఢ్‌కు చెందిన శకుంతలా యాదవ్‌ (55).. కొన్ని కుటుంబ కారణాల వల్ల రాయ్‌పూర్‌లోని తిక్రపార ప్రాంతంలో ఉన్న ఇంట్లో ఒంటరిగా నివవిస్తున్నారు. ఆమెకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఆమె నివాసం ఉంటున్న ప్రాంతానికి అతడు కొద్ది దూరంలోనే నివసిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు తన తల్లికి ప్రతిరోజూ ఫోన్ చేసి, ఆమె యోగక్షేమాలు అడుగుతుండే వాడు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి కూడా అతడు తన తల్లికి ఫోన్ చేశాడు. అయితే ఆమె ఎంతకూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో అతడు సరాసరి తన తల్లి ఉంటున్న ఇంటి వద్దకే వచ్చేశాడు. తీరా అక్కడకు వచ్చిన తర్వాత ఆ ఇంటి తలుపులు బయట నుంచి గడియపెట్టి ఉండటం చూసి అతడు షాకయ్యాడు. అనంతరం.. ఆ తలుపులు ఓపెన్ చేసి, ఇంట్లోకి వెళ్లాడు. ఈ క్రమంలో తల్లి గదిలోకి వెళ్లిన అతడు.. అక్కడ కనిపించిన దృశ్యాలను చూసి భయాందోళనలకు గురయ్యాడు. బెడ్‌రూంలో విగత జీవిగా ఉన్న తల్లిని చూసి షాకయ్యాడు. అనంతరం వెంటనే ఇంట్లోంచి బయటికొచ్చి విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పాడు. ఈ క్రమంలోనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శకుంతల కాళ్లు, చేతులను కట్టేసి, గొంతు నులుమి హత్య చేసినట్టు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆస్తి వివాదాల కారణంగా శకుంతలను దగ్గరి వారే హత్య చేసే ఉంటారనే కోణంలో పోలీసులు తమ దర్యాప్తును ప్రారంభించారు. 
Updated Date - 2021-10-20T20:43:56+05:30 IST