పెళ్లయిన 9 రోజులకు ఇద్దరూ కలిసి గుడికి.. బాత్రూంకు వెళ్లిన ఆ భార్య ఎంతకూ తిరిగి రాకపోవడంతో అనుమానంతో ఆ భర్త వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2021-10-22T00:18:20+05:30 IST

మ్యారేజీ బ్యూరో ద్వారా ఓ యువతి, యువకుడికి పెళ్లి కుదిరింది. దీంతో బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో ఆ యువతి, యువకుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అప్పగింతలు పూర్తైన తర్వాత వధువు.. పెళ్లి కొడుకు ఇంటికి చేరుకుంది. పెళ్లై అప్పటికే 9 రోజులు గడిచిపోవడంతో.. మొక్కు తీర్చుకునేందుకు ఆ నవదంపతులు ఇద్దరూ స్థానికంగా ఓ గుడికి వెళ్లారు. గుడిలో కార్య

పెళ్లయిన 9 రోజులకు ఇద్దరూ కలిసి గుడికి.. బాత్రూంకు వెళ్లిన ఆ భార్య ఎంతకూ తిరిగి రాకపోవడంతో అనుమానంతో ఆ భర్త వెళ్లి చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: మ్యారేజీ బ్యూరో ద్వారా ఓ యువతి, యువకుడికి పెళ్లి కుదిరింది. దీంతో బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో ఆ యువతి, యువకుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అప్పగింతలు పూర్తైన తర్వాత వధువు.. పెళ్లి కొడుకు ఇంటికి చేరుకుంది. పెళ్లై అప్పటికే 9 రోజులు గడిచిపోవడంతో.. మొక్కు తీర్చుకునేందుకు ఆ నవదంపతులు ఇద్దరూ స్థానికంగా ఓ గుడికి వెళ్లారు. గుడిలో కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఆ నవవధువు బాత్రూంకు వెళ్లొస్తానంటూ భర్తకు చెప్పి, బయటికి వెళ్లింది. బాత్రూంకు వెళ్లొస్తానన్న భార్య ఎంతకూ తిరిగి రాకపోవడంతో.. చుట్టుపక్కల వెతికి అతడు ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత ఇంట్లో కనిపించిన దృశ్యాలను చూసి అతడు కంగుతిన్నాడు. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాకు చెందిన ఓ యువకుడు గత కొద్ది రోజులుగా పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పంజాబ్‌లోని ఓ మ్యారేజ్ బ్యూరోను సంప్రదించాడు. ఆ మ్యారేజీ బ్యూరో ప్రతినిధులు 24ఏళ్ల ఓ అమ్మాయి ఫొటోను చూపించారు. ఆ అమ్మాయి అతడికి, అతడి కుటుంబ సభ్యులకు నచ్చింది. అమ్మాయి తరఫున వాళ్లకు కూడా యువకుడు నచ్చడంతో అక్టోబర్ 8న ఆ యువతి, యువకుడికి కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి జరిగింది. అప్పగింతల కార్యక్రమం ముగిసిన తర్వాత ఆ నూతన వధువు తన అత్తారింటికి చేరుకుంది. పెళ్లి జరిగి 9 రోజులు పూర్తైన తర్వాత.. మొక్కు తీర్చుకునేందుకు ఆ నవదంపతులు స్థానికంగా ఉన్న గుడికి వెళ్లారు. అక్కడ పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత.. బాత్రూంకు వెళ్లొస్తానంటూ ఆ నవవధవు బయటికి వెళ్లింది. బయటికి వెళ్లొస్తానంటూ వెళ్లిన భార్య ఎంతకీ తిరిగి రాకపోవడంతో.. కొద్ది సేపు గుడిలోనే ఎదురుచూసిన భర్త ఇంటికి చేరుకున్నాడు. అనంతరం అక్కడ కనిపించిన దృశ్యాలను చూసి, షాకయ్యాడు. ఇంట్లో దాచి ఉంచిన సుమారు రెండు లక్షల డబ్బు, నగలు, ఫొన్ కనిపించకుండా పోవడంతో కంగుతిన్నాడు. బాత్రూంకు వెళ్లొస్తానంటూ చెప్పిన భార్య.. సుమారు సుమారు రెండు లక్షల డబ్బు, మరో రెండు లక్షల విలువైన బంగారంతో పరారైనట్లు గుర్తించి షాకయ్యాడు. ఆ తర్వాత జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. 
Updated Date - 2021-10-22T00:18:20+05:30 IST