Viral Video: పాతకార్ల విడిభాగాలతో సొంతంగా హెలికాప్టర్ తయారు చేసుకున్న వ్యక్తి

ABN , First Publish Date - 2021-12-12T01:18:41+05:30 IST

అతడు పేద కుటుంబంలో పుట్టాడు. పెద్ద పెద్ద చదువులు కూడా చదవలేదు. కానీ హెలికాప్టర్‌లో ప్రయాణించాలని ఆశ పడ్డాడు. అయితే..అందుకు సరిపడా డబ్బులు లేవని.. అతడు తన కోరికను చంపుకోలేదు. అ

Viral Video: పాతకార్ల విడిభాగాలతో సొంతంగా హెలికాప్టర్ తయారు చేసుకున్న వ్యక్తి

ఇంటర్నెట్ డెస్క్: అతడు పేద కుటుంబంలో పుట్టాడు. పెద్ద పెద్ద చదువులు కూడా చదవలేదు. కానీ హెలికాప్టర్‌లో ప్రయాణించాలని ఆశ పడ్డాడు. అయితే..అందుకు సరిపడా డబ్బులు లేవని.. అతడు తన కోరికను చంపుకోలేదు. అనుకుంటే ఏదైనా సాధించొచ్చు అని బలంగా నమ్మాడు. చివరకు హెలికాప్టర్నే తన ఇంటి ముందు నిలబెట్టాడు. దీంతో అతడు చేసిన పనికి అంతా ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



విమానాలు, హెలికాప్టర్లు ఇంటి మీద నుంచి వెళ్తుంటే.. బ్రెజిల్‌కు చెందిన వ్యక్తి తాను కూడా గాల్లో ఎగరాలని ఆశపడ్డాడు. ఆర్థిక కారణాల వల్ల అది సాధ్యం కాదని తెలిసుకుని.. తానే ఓ హెలికాప్టర్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుబాటులో ఉన్న పాత కార్ల విడిభాగాలు, వోక్స్‌వాగన్ బీటిల్ కారు ఇంజిన్ ముందేసుకుని పని ప్రారంభించాడు. అదిచూసి కొందరు హేళన చేస్తే.. మరికొందరు అతడిని ప్రోత్సహించారు. చివరకు హేళన చేసిన నోళ్లే.. ఔరా అనేలా హెలికాప్టర్‌ను తయారు చేసి చూపించాడు. అంతేకాకుండా.. దానిలో ప్రయాణిస్తూ ఊరు చుట్టూ చక్కర్లు కొట్టాడు. ఈ క్రమంలో ఆ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు స్పందిస్తూ.. అతడిపై ప్రశంసలు కరిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు తక్కువ ఖర్చుతో హెలికాప్టర్ తయారు చేయబోయి.. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 






Updated Date - 2021-12-12T01:18:41+05:30 IST