మేక కడుపున వింత జీవి.. మనిషిని పోలిన ఆకారంతో.. చూసేందుకు ఎగబడుతున్న జనం!

ABN , First Publish Date - 2021-12-29T23:01:18+05:30 IST

అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి.

మేక కడుపున వింత జీవి.. మనిషిని పోలిన ఆకారంతో.. చూసేందుకు ఎగబడుతున్న జనం!

అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి అసోంలో జరిగింది. అసోంలోని సాచర్ జిల్లాకు చెందిన గంగాపూర్ గ్రామంలో ఓ మేక వింత జీవికి జన్మనిచ్చింది. మనిషిని పోలీన ఆకారంతో ఉన్న ఆ జీవిని చూసేందుకు స్థానిక ప్రజలు ఎగబడుతున్నారు. ఆ జీవి కళ్లు, ముక్కు, నోరు మనిషిని పోలి ఉన్నాయి. అయితే చెవులు మాత్రం మేకలా ఉన్నాయి. ఈ జీవి పుట్టగానే మరణించింది. ఆ జీవిని చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు.  


ఈ ఏడాది ఆరంభంలో ఇండోనేసియాకు చెందిన జాలరికి మనిషి మొహంతో ఉన్న షార్క్ పిల్ల దొరికిన సంగతి తెలిసిందే. అబ్దుల్లా అనే జాలరి వలకు ఈ ఏడాది ఫిబ్రవరి 21న ఓ భారీ షార్క్ చిక్కింది. దానిని కోయగా.. దాని లోపల మూడు పిల్లలు ఉన్నాయి. రెండు తల్లిలాగానే ఉండగా.. మూడోది మాత్రం అచ్చం మనిషిలా కనిపించింది. ఈ వార్త అప్పట్లో వైరల్ అయింది. Updated Date - 2021-12-29T23:01:18+05:30 IST