ఇంటి ముందు నిలుచున్న యువతి.. సడన్‌గా గగ్గోలు పెడుతూ ఏడుపులు.. భయంతో ఆ తల్లిదండ్రులు బయటికొచ్చిచూస్తే..

ABN , First Publish Date - 2021-10-08T00:13:20+05:30 IST

అప్పటి వరకూ ఇంట్లోనే ఉండి.. అప్పుడే బయటకు వెళ్లిన యువతి సడన్‌గా గగ్గోలు పెట్టడం మొదలు పెట్టింది. భయంతో ఏడుస్తున్న కూతురి గొంతు విన్న ఆ యువతి తల్లిదండ్రులు ఒక్కసా

ఇంటి ముందు నిలుచున్న యువతి.. సడన్‌గా గగ్గోలు పెడుతూ ఏడుపులు.. భయంతో ఆ తల్లిదండ్రులు బయటికొచ్చిచూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: అప్పటి వరకూ ఇంట్లోనే ఉండి.. అప్పుడే బయటకు వెళ్లిన యువతి సడన్‌గా గగ్గోలు పెట్టడం మొదలు పెట్టింది. భయంతో ఏడుస్తున్న కూతురి గొంతు విన్న ఆ యువతి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకయ్యారు. ఏం జరిగిందో అని ఆందోళన చెందుతూ.. హుటాహుటిన ఇంట్లోంచి బయటికొచ్చారు. అనంతరం గేటు వద్ద తమ కూతురి పరిస్థితిని చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


లక్నోలోని జానకీపురానికి చెందిన ఓ యువతికి సుమారు 18ఏళ్ల వయసు ఉంటుంది. స్థానికంగా ఓ కాలేజీలో గ్రాడ్యూయేషన్ చేస్తున్న ఆమె.. గురువారం నాడు కాలక్షేపం కోసం ఇంటి నుంచి బయటికొచ్చింది. గేటు వద్ద నిల్చుని ఉన్న ఆమెపై అకస్మాత్తుగా ఓ దుండగుడు బ్లేడుతో దాడి చేశాడు. ఆమె ముఖంపై దాడి చేసి, గాయపరిచాడు. దీంతో ఆ యువతి అక్కడే కుప్పకూలింది. ఏడుస్తూ గగ్గోలు పెట్టింది. ఈ క్రమంలో కూతురి ఏడుపు చప్పుడు విన్న కుటుంబ సభ్యులు.. భయంగా ఇంట్లోంచి బయటికొచ్చారు. గేటు వద్ద ముఖం పట్టుకుని ఏడుస్తున్న కూతురిని చూసి షాకయ్యారు. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు.అంతేకాకుండా దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఓ వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి.. ‘నాకు దక్కని నువ్వు.. ఇంకెవ్వరికీ దక్కకూడదు’ అంటూ తనపై దాడి చేశాడని బాధితురాలు చెప్పడంతో పోలీసులు..  శుభమ్ రాజు అనే వ్యక్తే ఈ దాడి చేసినట్లు గుర్తించారు. శుభమ్ రాజు కొంత కాలంగా సదరు యువతిని వెంబడిస్తున్నాడని.. అయితే ఆ యువతి మాత్రం అతడిని పట్టించుకోకపోవడంతో ఈ దాడికి పాల్పడ్డట్లు భావిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా.. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


Updated Date - 2021-10-08T00:13:20+05:30 IST