చేయి లేదని కుంగిపోలేదు.. ఇతడి ఆత్మవిశ్వాసం ముందు... ఓటమి కూడా తలవంచాల్సిందే..

ABN , First Publish Date - 2021-12-30T02:51:10+05:30 IST

నాగ్‌పూర్‌లోని జరీపట్కా ప్రాంతానికి చెందిన యువకుడికి ఒక చేయి సగం మాత్రమే ఉంది. అయినా అతను ఏమాత్రం కుంగిపోలేదు. ఆత్మవిశ్వాసంతో తనలోని టాలెంట్‌కి పదును పెట్టాడు. గత 15ఏళ్లుగా.. నాగ్‌పూర్‌లో ఫేమస్ అయిన..

చేయి లేదని కుంగిపోలేదు.. ఇతడి ఆత్మవిశ్వాసం ముందు... ఓటమి కూడా తలవంచాల్సిందే..

అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న వారు.. చాలా మంది సోమరితనంతో తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. మరికొందరు చెడు అలవాట్లకు బానిసలై.. వివిధ నేరాలు చేసి జైలుపాలవుతుంటారు. ఇంకొందరైతే ఉన్న అవకాశాలను కూడా దుర్వినియోగం చేసుకుంటూ.. ఏ పనీ చేయకుండా తల్లిదండ్రులకు భారంగా మారుతుంటారు. చిన్న చిన్న సమస్యలకు తీవ్రంగా కుంగిపోతూ కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇలాంటి వారందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడో వ్యక్తి. చేయి లేకున్నా అతను ఏమాత్రం కుంగిపోలేదు. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా సొంత కాళ్ల మీద నిలబడి, రెండు చేతులా సంపాదిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే..


నాగ్‌పూర్‌లోని జరీపట్కా ప్రాంతానికి చెందిన యువకుడికి ఒక చేయి సగం మాత్రమే ఉంది. అయినా అతను ఏమాత్రం కుంగిపోలేదు. ఆత్మవిశ్వాసంతో తనలోని టాలెంట్‌కి పదును పెట్టాడు. గత 15ఏళ్లుగా.. నాగ్‌పూర్‌లో ఫేమస్ అయిన సింధీ చోలే రైస్‌, తర్రి పోహా అనే స్ట్రీట్ ఫుడ్, చోలే పోహాను విక్రయిస్తూ ఎవరి మీద ఆధారపడకుండా.. సొంతంగా సంపాదిస్తున్నాడు. మనసుంటే మార్గం ఉంటుందని నిరూపిస్తూ... నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇతడి స్ట్రీట్ ఫుడ్‌ను టేస్ట్ చేసేందుకు జనం క్యూ కడుతున్నాట. ఆహార ప్రియులంతా తన వంటను రుచి చూడడంతో పాటూ.. తన ప్రతిభను చూసి తెగ మెచ్చుకుంటున్నారు.

తల్లిపాలతో ఆభరణాల తయారీ.. మహిళల నుంచి వెల్లువెత్తుతున్న ఆర్డర్లు.. ఎక్కడో తెలుసా..


సగం చేయి లేకున్నా.. ఎంతో చాకచక్యంగా ప్లేట్‌ను పట్టుకోవడం, అంతే వేగంగా భోజనం వడ్డించడం చూసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న వారు కూడా చేయలేని విధంగా ఇతను కష్టపడుతున్న విధానంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగం రాలేదని బాధపడేకంటే.. మనలోని టాలెంట్‌కు పదును పెడితే ఎన్నో ఉపాధి అవకాశాలు ఉంటాయని.. గర్వంగా చెబుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను అమర్ సిరోహి అనే యూట్యూబర్... తన ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఎయిర్‌పోర్టులో దిగిన మహిళ.. చెకింగ్ చేస్తుండగా ఉన్నట్టుండి కుప్పకూలిన వైనం.. చివరకు అసలు విషయం తెలిసి..Updated Date - 2021-12-30T02:51:10+05:30 IST