35ఏళ్ల బాయ్ ఫ్రెండ్ కావాలంటున్న 85 ఏళ్ల బామ్మ.. పేపర్ యాడ్ ఇచ్చి మరీ..

ABN , First Publish Date - 2021-07-11T07:41:47+05:30 IST

వార్త శీర్షిక చదవగానే మీ కళ్లు పెద్దవై ఉంటాయి. ఆశ్యర్యంతో నోరు తెరిచి ఉంటారు. కానీ ఇది నిజం. 85ఏళ్ల హట్టి రెట్రోజ్ అనే బామ్మ..

35ఏళ్ల బాయ్ ఫ్రెండ్ కావాలంటున్న 85 ఏళ్ల బామ్మ.. పేపర్ యాడ్ ఇచ్చి మరీ..

ఇంటర్నెట్ డెస్క్: వార్త శీర్షిక చదవగానే మీ కళ్లు పెద్దవై ఉంటాయి. ఆశ్యర్యంతో నోరు తెరిచి ఉంటారు. కానీ ఇది నిజం. 85ఏళ్ల హట్టి రెట్రోజ్ అనే బామ్మ కథ ఇది. ఆమె ఈ మధ్యనే తన 39ఏళ్ల బాయ్ ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పేసింది. ఇప్పుడు కొత్తగా 35ఏళ్ల వయసున్న బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతోంది. దీనికోసం డేటింగ్ యాప్‌లలో వెదుకుతోంది. అంతేకాదు.. దాని కోసం ఏకంగా పేపర్లో ప్రకటన, టీవీల్లో ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది. ప్రస్తుతం తనకు బాయ్‌ఫ్రెండ్ లేడని, కొత్త బాయ్ ఫ్రెండ్ కావాలని ఆ ప్రకటనల్లో పేర్కొంటోంది.


హట్టి రెట్రోజ్ న్యూయార్క్‌లో నివసిస్తోంది. ఆమెకు డేటింగ్ అంటే పిచ్చి. తనకంటే వయసులో అతి తక్కువ వయసున్న మగాళ్లతో తిరుగుతూ వారితో సెక్స్‌ లైఫ్‌ను ఎంజాయ్ చేయడం ఆమెకు ఆనందం. 48 ఏళ్ల వయస్సులో ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి ఆమె పెళ్లి చేసుకోలేదు. కానీ తన కంటే తక్కువ వయస్సు ఉన్న కుర్రాళ్లతో డేటింగ్ చేయడానికి తెగ ఆసక్తి చూపుతుంది. అందులో భాగంగానే డేటింగ్ యాప్‌లలో ఖాతాలు తెరిచి తనకు సరైన జోడీ కోసం వెదుకుతోంది. కాగా.. ఇప్పటివరకు ఆమె ఉన్న డేటింగ్‌ యాప్‌లో ఆమెను చాలా మంది తిరస్కరించారు. దీంతో ఆ యాప్‌ హట్టిని బ్లాక్ చేసింది. ఈ క్రమంలోనే కొత్త డేటింగ్ యాప్‌‌ల ద్వారా ఆమె తన ప్రియుడి కోసం వెదుకుతోంది.  


ఇదిలా ఉంటే ఈ బామ్మ ఒంటరి అని ఎవరైనా అనుకుంటే పొరపాటే. ఈమెకు ఇద్దరు పిల్లలు, ముగ్గురు మనవళ్లు ఉన్నారు. యవ్వనంలో ఉన్నప్పుడు ఆమె డ్యాన్సర్‌గా పనిచేసింది. ప్రస్తుతం లైఫ్ కోచ్, రచయితగా పనిచేస్తోంది. ఈ వయసులో కూడా కోరికలతో రగిలిపోతున్న ఈ బామ్మపై ఇప్పటికే అనేక ఛానళ్లు ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా తీసుకుంటున్నాయి. అయితే ఆ ఇంటర్వ్యూల్లో కూడా హట్టి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.


ఇటీవల ఓ ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు. డేటింగ్ యాప్‌లో మళ్లీ నాకు తగిన జోడీ కోసం ప్రయత్నిస్తాను. మళ్లీ ఎంజాయ్ చేస్తాను. నా సెక్స్ స్టైల్ నాకెంతో నచ్చుతుంది. వయస్సు మళ్లిన పురుషులు తక్కువ వయస్సు యువతులతో ఎంజాయ్ చేస్తారు. నేను కూడా అంతే’’ అని బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. డేటింగ్ చేసేందుకు తనకు 35 ఏళ్ల లోపు యువకులు కావాలని పత్రిక ప్రకటన ఇచ్చి మరీ పార్టనర్‌ కోసం వెతకడం మొదలెట్టింది. చిత్రం ఏమిటంటే.. ఆమెతో డేటింగ్ చేసేందుకు చాలామంది యువకులు రిక్వెస్టులు పంపుతున్నారు.

Updated Date - 2021-07-11T07:41:47+05:30 IST