నేను భయపడలేదు.. ఎంతో ఎంజాయ్ చేశా.. 72 ఏళ్ల ఈ వృద్ధురాలి అరుదైన ఫీట్‌ను చూసి నివ్వెరపోతున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2021-12-28T22:27:02+05:30 IST

తాడు కట్టుకుని రోప్ జర్నీ (జిప్ లైనింగ్) చేసేందుకు కుర్రాళ్లు సైతం భయపడుతుంటారు.

నేను భయపడలేదు.. ఎంతో ఎంజాయ్ చేశా.. 72 ఏళ్ల ఈ వృద్ధురాలి అరుదైన ఫీట్‌ను చూసి నివ్వెరపోతున్న నెటిజన్లు

తాడు కట్టుకుని రోప్ జర్నీ (జిప్ లైనింగ్) చేసేందుకు కుర్రాళ్లు సైతం భయపడుతుంటారు. అయితే ఓ 72 ఏళ్ల బామ్మ ఆ జర్నీని చాలా సునాయాసంగా పూర్తి చేసింది. సాహసం చేసేందుకు వయసు అడ్డంకి కాదని నిరూపించింది. కేరళకు చెందిన ఓ బామ్మ చీర కట్టుకుని జిప్ లైనింగ్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


పాలక్కడ్‌లోని ఓ పార్క్‌లో ఇటీవల జిప్ లైనింగ్ ఏర్పాటు చేశారు. అక్కడకు ఓ 72 ఏళ్ల బామ్మ వెళ్లి జిప్ లైనింగ్ చేసింది. ఆ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో ఏర్పాటు చేశారు. `నాకేం భయం వేయలేదు. చాలా సరదాగా అనిపించింది.. చాలా బాగుంది` అని ఆమె రైడ్ అనంతరం వ్యాఖ్యానించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. Updated Date - 2021-12-28T22:27:02+05:30 IST