21 ఏళ్ల కుర్రాడితో పెళ్లికి సిద్ధమైన 45 ఏళ్ల మహిళ.. నిలదీసిన ఐదుగురు కూతుళ్లు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2021-07-12T17:58:57+05:30 IST

ఆమెకు 45 ఏళ్ల వయసు. ఒకరి తర్వాత మరొకరు.. ఇలా ముగ్గురిని పెళ్లి చేసుకుంది. ఫలితంగా ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమార్తె వయసు 21 ఏళ్లు. ఆమెకు గతేడాదే పెళ్లయింది.

21 ఏళ్ల కుర్రాడితో పెళ్లికి సిద్ధమైన 45 ఏళ్ల మహిళ.. నిలదీసిన ఐదుగురు కూతుళ్లు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ఆమెకు 45 ఏళ్ల వయసు. ఒకరి తర్వాత మరొకరు.. ఇలా ముగ్గురిని పెళ్లి చేసుకుంది. ఫలితంగా ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమార్తె వయసు 21 ఏళ్లు. ఆమెకు గతేడాదే పెళ్లయింది. 19 ఏళ్లు, 16 ఏళ్లు, 14 ఏళ్లు, 12 ఏళ్ల వయసున్న మరో నలుగురు కుమార్తెల బాధ్యత ఆమెపై ఉంది. మూడో భర్త కూడా కన్నుమూయడంతో వారి భవిష్యత్ అంతా ఆమె చేతుల్లోనే ఉంది. కానీ బాధ్యతగా ఉండాల్సిన ఆమె మాత్రం తప్పుదోవ పట్టింది. తన పెద్ద కుమార్తె వయసున్న ఓ కుర్రాడితో ప్రేమాయణం మొదలు పెట్టింది. వద్దమ్మా.. తప్పమ్మా.. అని చెప్పిన పాపానికి కూతుళ్లును తన ఇంట్లోంచి బయటకు గెంటేసింది. అతడితో కలిసి ఏకంగా ఇంట్లోనే మకాం పెట్టింది. చివరకు పెళ్లికి కూడా సిద్ధమవడంతో ఆ కూతుళ్లు పోలీసులను ఆశ్రయించారు. ఫలితంగా ఆ 45 ఏళ్ల మహిళ, 21 ఏళ్ల ఆమె ప్రియుడి కథ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 


ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ మొహల్లా ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వయసున్న మహిళకు ఐదుగురు కూతుళ్లున్నారు. ఆమెకు  15 ఏళ్ల వయసులోనే మొదటిసారి పెళ్లయింది. రెండేళ్లలోనే భర్తతో విబేధాలు రావడంతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత వినోద్ అనే వ్యక్తిని పెళ్లాడింది. రోడ్డు ప్రమాదంలో రెండో భర్త కూడా మరణించడంతో కొన్నాళ్లు ఒంటరిగా గడిపింది. ఆ తర్వాత బ్రిజేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతడితో ఉండగానే 21 ఏళ్ల కుర్రాడు మిథున్‌తో కొన్నాళ్లుగా ప్రేమాయణం నడుపుతోంది. ఈ క్రమంలోనే ఆమె మూడో భర్త అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఆ జంటకు అడ్డు చెప్పే వాళ్లే లేకపోయారు. ఈ విషయం ఊళ్లో తెలిసి నలుగురూ నానా రకాలుగా మాట్లాడుకుంటుండటంతో వారి కూతుళ్లు దీన్ని అవమానంగా భావించారు. 


ఆమె ఐదుగురు కూతుళ్లలలో 21 ఏళ్ల వయసున్న పెద్ద కుమార్తెకు కొద్ది నెలల క్రితమే వివాహం అయింది. ఆమె కూడా ఇంటికి వచ్చి తల్లిని నిలదీసింది. పద్ధతి మానుకోమనీ, పెళ్లీడుకు వచ్చిన కూతుళ్లు ఉన్నారనీ, వారి భవిష్యత్ కోసమైనా సక్రమంగా నడుచుకోవాలని హితవు చెప్పింది. దీన్ని సహించలేక ఆ మహిళ పెద్ద కుమార్తెను ఇంటి నుంచి బయటకు గెంటేసింది. మిగిలిన నలుగురు కూతుళ్లు కూడా ఆమెపై ఆగ్రహించడంతో వారిని కూడా ఇంట్లోంచి వెళ్లగొట్టింది. దీంతో ఆ కూతుళ్లంతా శనివారం పోలీసులను ఆశ్రయించారు. వ్యవహారం తెలిసిన పోలీసులు ఆ ప్రేమ జంటను స్టేషన్‌కు పిలిపించారు. 


అయితే స్టేషన్‌లో వాళ్లు చెప్పిన విషయాలను విని పోలీసులే కంగుతిన్నారు. ‘మేం మేజర్లం. మాకిష్టం వచ్చినట్టు బతుకుతాం. మీకేంటి నష్టం. నా కూతుళ్లకు నేను అన్నం పెట్టడం లేదా..? హింసిస్తున్నానా..? ఏంటీ గొడవ.? అతడితో నేను ఉంటే తప్పేంటి.? నా కూతుళ్లకు వచ్చిన ఇబ్బందేంటి..?’ అంటూ ఆ మహిళ పోలీస్ స్టేషన్లోనే వాదులాట పెట్టుకుంది. అటు మిథున్ కూడా మరింత అడ్వాన్స్ అయ్యాడు. ‘మా విషయం గురించి ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదు. పరువు పోతుందని ఇబ్బంది పడనక్కర్లేదు. నేను తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. త్వరలోనే ఆమెను నా భార్యగా చేసుకుంటా. ఆమె కూతుళ్లను నా కూతుళ్లుగా చూసుకుంటా. నా సంపాదన అంతా వారికే ఖర్చు చేస్తా. వారి పెళ్లిళ్లు చేస్తా. భవిష్యత్తులో వాళ్లకు అండగా ఉంటా’ అంటూ మిథున్ చెప్పిన మాటలు విని పోలీసులు తలలు పట్టుకున్నారు. చివరకు వాళ్లిద్దరికీ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇది పద్ధతి కాదని నచ్చజెప్పారు. అయితే పోలీసులు ఇచ్చిన కౌన్సిలింగ్‌తో మిథున్‌లో పరివర్తన వచ్చింది. ఆ మహిళను తాను ఇక కలవబోనని చెప్పేశాడు. కానీ, ఆ మహిళ మాత్రం తాను ఇంకా మిథున్‌ను వదులుకోదలచుకోలేదని చెప్పడం గమనార్హం. 

Updated Date - 2021-07-12T17:58:57+05:30 IST