ఇంట్లోంచి బిలబిలమంటూ 40 పాములు... వాటి వెనుక 90 గుడ్లు... వణికిపోయిన స్థానికులు!
ABN , First Publish Date - 2021-07-24T17:03:28+05:30 IST
యూపీలోని సంత్‌కబీర్‌నగర్ జిల్లాలోని ఆ గ్రామంలోని...

సంత్‌కబీర్‌నగర్: యూపీలోని సంత్‌కబీర్‌నగర్ జిల్లాలోని ఆ గ్రామంలోని వారంతా ఆ క్షణంలో తీవ్రమైన భయభ్రాంతులకు గురయ్యారు. ఒక ఇంట్లోంచి ఒకేసారి 40 పాములు రావడం, అక్కడే 90 పాము గుడ్లు కనబడటంతో వారికి ఊపిరి ఆగిపోయినంత పనయ్యింది. ఈ ఉదంతం పడ్‌రహా గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం విజయ్ యాదవ్ అనే వ్యక్తి ఇంట్లో గత మూడు రోజులుగా పాములు బయటకు వస్తుండటంతో, వారి ఇంట్లోని వారంతా భయాందోళనలకు లోనయ్యారు. దీంతో ఈ విషయాన్ని విజయ్.. రెస్క్యూ టీమ్‌కు తెలియజేశారు. వారు వచ్చి ఒక్కొక్కటిగా పాములను పట్టుకోవడం ప్రారంభించారు. వారు మొత్తం 40 పాములతో పాటు 90 పాము గుడ్లను వెలికితీశారు. ఆ పాములను, గుడ్లను రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు.
