Viral Video: విమానాశ్రయంలో తండ్రితో వెళ్తుండగా ఎదురైన ఆర్మీ వాహనం.. అందులో సైనికుడిని చూసి నాలుగేళ్ల బాలుడు ఏం చేశాడో చూస్తే..
ABN , First Publish Date - 2021-10-26T00:09:37+05:30 IST
ఆ చిన్నోడికి సుమారు నాలుగేళ్ల వయసు ఉంటుంది. తండ్రి చేతిలో చేయి వేసి, విమనాశ్రయం ప్రాంగణంలో అటూ ఇటూ చూస్తూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో కుర్రాడికి ఆర్మీ వాహనం కనిపించింది. ఆ వాహనంలో ఓ జవానును చూసిన కుర్రాడు.. వెంటనే తన తండ్రిని చేతిని వదిలిపెట్టాడు. అనంతరం అందరూ ఆశ్చర్యపోయే పని చేశాడు. ఈ క్రమంలో కొడుకు చేసిన పనికి మురిసి పోయిన

ఇంటర్నెట్ డెస్క్: ఆ చిన్నోడికి సుమారు నాలుగేళ్ల వయసు ఉంటుంది. తండ్రి చేతిలో చేయి వేసి, విమనాశ్రయం ప్రాంగణంలో అటూ ఇటూ చూస్తూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో కుర్రాడికి ఆర్మీ వాహనం కనిపించింది. ఆ వాహనంలో ఓ జవానును చూసిన కుర్రాడు.. వెంటనే తన తండ్రిని చేతిని వదిలిపెట్టాడు. అనంతరం అందరూ ఆశ్చర్యపోయే పని చేశాడు. ఈ క్రమంలో కొడుకు చేసిన పనికి మురిసి పోయిన ఆ తండ్రి.. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ చిన్నోడి వీడియో పట్ల ఏకంగా కేంద్ర మంత్రి స్పందించి.. వీడియోను రీట్వీట్ చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆ నాలుగేళ్ల చిన్నారికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
బెంగళూరుకు చెందిన అర్జున్ అనే వ్యక్తి ఈ నెల 24న తన నాలుగేళ్ల కుమారుడు వీర్‌తో కలిసి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో వీర్ తన తండ్రి చేతిలో చేయి వేసి.. ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి.. పోతూ ఉన్న వాహనాలను ఆసక్తిగా గమనిస్తున్నాడు. ఈ సందర్భంగా ఆ చిన్నారి.. ఓ ఆర్మీ వాహనంలో జవాన్ నిల్చొని ఉండటాన్ని చూశాడు. ఆ తర్వాత... వీర్ తన తండ్రి చేతిని పెట్టి.. వాహనంలో ఉన్న ఆర్మీ జావాన్కు సెల్యూట్ చేశాడు. వీర్‌ను గమనించిన ఆ ఆర్మీ జవాన్ కూడా.. సెల్యూట్‌కు ప్రతి సెల్యూట్ చేశారు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియోను అర్జున్.. ‘ఇండియన్ ఆర్మీ.. మన నిజమైన హీరోలు’ అనే క్యాప్షన్‌తో ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోపట్ల కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా స్పందించి.. అర్జున్ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. అంతకాకుండా వీర్‌పై ప్రశంసలు కురిపించాడు. దీంతో వీర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోను 4లక్షల మంది వీక్షించగా అనేక మంది కామెంట్ చేశారు.