నడిరోడ్డుపై తిష్ట వేసిన మూడు పులులు.. కాస్త దూరంలోనే జీపులను ఆపేసిన ప్రయాణికులు.. చివరకు..

ABN , First Publish Date - 2021-12-19T23:06:40+05:30 IST

జూలో ఉన్న పులలను ఎలాంటి భయం లేకుండా చూడొచ్చు. కానీ.. బహిరంగ ప్రదేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్న పులి.. ఉన్నట్టుండి మనదారికి అడ్డొస్తే భయంతో వణికిపోతాం. అదే ఏకంగా మూడు పులులు

నడిరోడ్డుపై తిష్ట వేసిన మూడు పులులు.. కాస్త దూరంలోనే జీపులను ఆపేసిన ప్రయాణికులు.. చివరకు..

ఇంటర్నెట్ డెస్క్: జూలో ఉన్న పులలను ఎలాంటి భయం లేకుండా చూడొచ్చు. కానీ.. బహిరంగ ప్రదేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్న పులి.. ఉన్నట్టుండి మనదారికి అడ్డొస్తే భయంతో వణికిపోతాం. అదే ఏకంగా మూడు పులులు తారసపడితే.. గుండె ఆగినంత పని అవుతుంది. ఇపుడు ఇదంతా ఎందుకంటే.. ప్రస్తతం మూడు పులలకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్‌లోని పన్న టైగర్ రిజర్వ్‌లో.. కొందరు టూరిస్ట్‌లు శనివారం సఫారీలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. మూడు పులులు రోడ్డుపై కూర్చుని ఉండటాన్ని చూసి షాకయ్యారు. నడిరోడ్డుపైనే తిష్టవేసిన ఆ పులులు.. ఒకదానితో ఒకటి ఆడుకోవడం ప్రారంభిచాయి. దీంతో థ్రిల్‌గా ఫీల్ అయిన టూరిస్ట్‌లు.. సఫారీలను కాస్త దూరంలో నిలిపివేసి, కెమెరాలకు పని చెప్పారు. ఫోన్‌లు, కెమెరాల్లో ఆ దృశ్యాలను బంధించారు. ఈ వీడియోను రాఘవేంద్ర అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో.. పన్న టైగర్ రిజర్వ్ అధికారులు  రీట్వీట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. 


Updated Date - 2021-12-19T23:06:40+05:30 IST