22 ఏళ్ల కుర్రాడు.. ఎదిరింట్లో ఉండే వివాహితతో ప్రేమ.. తెల్లారేసరికి గ్రామంలో ఊహించని దారుణం..!

ABN , First Publish Date - 2021-08-26T02:20:25+05:30 IST

వివాహితతో యువకుడి ప్రేమ..ఆ తరువాత వారు తీసుకున్న నిర్ణయంతో గ్రామంలో పెద్ద కలకలం.

22 ఏళ్ల కుర్రాడు.. ఎదిరింట్లో ఉండే వివాహితతో ప్రేమ..  తెల్లారేసరికి గ్రామంలో ఊహించని దారుణం..!

ఇంటర్నెట్ డెస్క్: ఆ రోజు కూడా ఎప్పటిలాగే ప్రారంభమైంది. తెల్లవారడంతో గ్రామంలో అందరూ తమ పనుల్లో మునిగిపోయి ఉన్నారు. ఇంతలో.. ఓ యువకుడు చిన్న పనుంది అంటూ ఇంట్లో వాళ్లకి చెప్పి బయటకు వెళ్లాడు. అదే సమయంలో.. ఎదరింట్లో ఉండే వివాహిత కూడా ఇదే కారణం చెప్పి గడప దాటింది. ఆ తరువాత.. క్షణాలు నిమిషాలయ్యాయి.. నిమిషాలు గంటలయ్యాయి..కానీ వారిద్దరూ ఇంటికి తిరిగిరాలేదు. వారి వారి ఇళ్లలో కంగారు మొదలైంది. వారి కోసం కుటుంబసభ్యుల వెతకడం ప్రారంభించారు. మరోవైపు.. అదే గ్రామానికి చెందిన ఓ గొర్రెల కాపారి గొర్రెలను మేపుకుంటూ ఊరు బయటకొచ్చాడు. ఈ క్రమంలో...ఎదురుకుండా కొద్ది దూరంలో ఉన్న చెట్టుకు ఏవో ఆకారాలు వేళాడుతున్నట్టు అనిపించింది. అటువంటి దృశ్యాన్ని అంతకుముందెప్పుడూ అతడు చూడలేదు! 


అసలదేంటో తెలుసుకుందామనుకుని అతడు..ఆ చెట్టు దగ్గరకి వెళ్లాడు. అంతే ఒక్కసారిగా షాకైపోయాడు. చెట్టు కొమ్మకు యువతీయువకుల జంట ఉరేసుకుని వేళాడుతూ కనిపించింది. ఆ దృశ్యం చూసిన అతడికి గుండె ఆగినంతపనైంది. వెంటనే అతడు మరో ఆలోచన లేకుండా ఊరివైపు పరిగెత్తి కెళ్లిపోయాడు. విషయం ఊరి వారికి చెప్పాడు. అక్కడికి కొందరు వెళ్లి చూడగా వారికి భారీ షాకతగిలింది. ఆత్మహత్యకు పాల్పడ్డది జనతాదేవీ, పాపారామ్‌‌ అని తెలిసి గ్రామస్థులు ఒక్కసారిగా షాకైపోయారు. వారిద్దరూ ఇలా ఒకేసారి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో వారికి అర్థం కాలేదు.  పనుందంటూ బయటకు వెళ్లిన వారు ఇలా నిర్జీవంగా కనిపించడంతో వారి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు.


రాజస్థాన్‌ రాష్ట్రం జాలోర్ జిల్లాలోని రాయిథల్ గ్రామంలో ఇటీవల జరిగిన ఉదంతం ఇది. ఈ ఘటనతో  గ్రామస్థులు భారీ కుదుపుకు లోనయ్యారు.  వారిద్దరూ ప్రేమించుకున్నారని తెలిసి మరింత ఆశ్చర్యపోయారు. జనతాదేవీ, పాపారామ్‌‌లు ఎదురుబొదురు ఇళ్లలోనే నివసిస్తుంటారు. పాపారామ్ వ్యవసాయం చేస్తుంటాడు. ఇక జనాతాదేవీ భర్తది కూడా వ్యవసాయమే. అయితే..పాపారామ్, జనతాదేవీలు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. జనతాదేవీ వివాహిత కావడంతో వారి బంధాన్ని ప్రపంచం అంగీకరించదని వారు భావించారు. ఈ విషయమై ఎంతో కాలంగా వారి మధ్య చర్చోపర్చలు జరిగాయి. ఇంతలో అకస్మాత్తుగా వారిద్దరూ ఇలా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  

Updated Date - 2021-08-26T02:20:25+05:30 IST