స్కూలు బస్సులో వస్తున్న అన్న కోసం తండ్రితో వెళ్లిందా రెండేళ్ల చిన్నారి.. బస్సు ముందు నుంచే ఆ బాలిక వెళ్తోందని డ్రైవర్ చూడకపోవడంతో..

ABN , First Publish Date - 2021-10-28T20:34:41+05:30 IST

ఆడుకునేందుకు సోదరిడి కోసం ఎదురు చూసిన రెండేళ్ల చిన్నారి.. బస్సులో వచ్చిన అన్న కోసం తండ్రి వెనకాలే వెళ్లింది. బస్సు ముందు నుంచే వెళ్తున్న ఆ చిన్నారిని డ్రైవర్ చూసుకోకపోవడంతో జరగాని ఘోరం జరిగిపోయింది. ఆ దుర్ఘటనకు సంబంధించిన దృశ్యా

స్కూలు బస్సులో వస్తున్న అన్న కోసం తండ్రితో వెళ్లిందా రెండేళ్ల చిన్నారి.. బస్సు ముందు నుంచే ఆ బాలిక వెళ్తోందని డ్రైవర్ చూడకపోవడంతో..

ఇంటర్నెట్ డెస్క్: ఆడుకునేందుకు సోదరిడి కోసం ఎదురు చూసిన రెండేళ్ల చిన్నారి.. బస్సులో వచ్చిన అన్న కోసం తండ్రి వెనకాలే వెళ్లింది. బస్సు ముందు నుంచే వెళ్తున్న ఆ చిన్నారిని డ్రైవర్ చూసుకోకపోవడంతో జరగాని ఘోరం జరిగిపోయింది. ఆ దుర్ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...మధ్యప్రదేశ్‌లోని బర్వానీ గ్రామానికి చెందిన యాషికా రాథోడ్ అనే రెండేళ్ల చిన్నారికి ఓ సోదరుడు ఉన్నాడు. అతడు స్థానికంగా ఉన్న ప్రైవేటు స్కూల్‌లో చదువుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం రోజు ఉదయం స్కూల్‌కు వెళ్లిన అతడు.. సాయంత్రం 4 గంటలకు స్కూల్ ‌బస్సులో తిరిగొచ్చాడు. దీంతో సోదరుడిని ఇంటికి తీసుకెళ్లేందుకు యాషికా.. తన తండ్రి వెనకాలే వెళ్లింది. ఈ నేపథ్యంలో బస్సు ముందు నుంచే తన సోదరుడి దగ్గరుకు వెళ్తున్న ఆ చిన్నారిని బస్సు డ్రైవర్ గమనించలేదు. చిన్నారిని చూడకుండా.. డ్రైవర్ బస్సును ముందుకు తీసుకెళ్లాడు.


దీంతో ఆ చిన్నారి.. బస్సు చక్రాల కింద పడి.. ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు కేకలు వేయడంతో.. చిన్నారిని చూసేందుకు బస్సు డ్రైవర్ కదిలే బస్సు నుంచే కిందకు దూకేశాడు. దీంతో 12 మంది ఇతర విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. అయితే స్థానిక యువకులు బస్సులోకి వెళ్లి, బ్రేక్ వేయడంతో వారి ప్రాణాలకు పెను ముప్పు తప్పింది. కాగా.. ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డు కావడంతో.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. యాషికా తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బస్సు డ్రైవర్‌ను అరెస్ట్ చేయడంతోపాటు బస్సును సీజ్ చేశారు.
Updated Date - 2021-10-28T20:34:41+05:30 IST