నిర్మాణంలో ఉన్న ఇంట్లో మాట్లాడుకుంటుండగా దొరికిపోయిన ప్రేమజంట.. పంచాయితీలో పెళ్లికి డేట్ ఫిక్స్.. రెండ్రోజుల్లో పెళ్లనగా..

ABN , First Publish Date - 2021-11-26T22:50:32+05:30 IST

వారిద్దరూ ప్రేమికులు.. పెద్దలకు తెలియకుండా తరచుగా మాట్లాడుకునే వారు..

నిర్మాణంలో ఉన్న ఇంట్లో మాట్లాడుకుంటుండగా దొరికిపోయిన ప్రేమజంట.. పంచాయితీలో పెళ్లికి డేట్ ఫిక్స్.. రెండ్రోజుల్లో పెళ్లనగా..

వారిద్దరూ ప్రేమికులు.. పెద్దలకు తెలియకుండా తరచుగా మాట్లాడుకునే వారు.. దీపావళి తర్వాతి రోజు నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో కలుసుకున్నారు.. అక్కడ మాట్లాడుకుంటుండగా యువతి తల్లిదండ్రులకు, ఊరి వారికి దొరికిపోయారు.. దాంతో ఊరి పెద్దలు ఇరు వైపుల వారికి నచ్చ చెప్పి వివాహం నిశ్చయించారు.. అయితే పెళ్లి ముహూర్తానికి రెండ్రజుల ముందు ఆ యువతి ఉరేసుకుని చనిపోయింది.. బీహార్‌లోని భాగల్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


భాగల్‌పూర్‌కు చెందిన సోనీ కుమారి అనే యువతి అదే గ్రామానికి చెందిన పురుషోత్తం అనే యువకుడితో రహస్యంగా ప్రేమాయణం సాగిస్తోంది. దీపావళి తర్వాతి రోజు వారిద్దరూ నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో మాట్లాడుకుంటూ పెద్దలకు దొరికిపోయారు. దీంతో సోనీ తల్లిదండ్రులు, ఊరి పెద్దలు పురుషోత్తం తండ్రిని పంచాయతీకి పిలిచారు. ఇద్దరికీ పెళ్లి చేయాలని అడిగారు. పెళ్లి తనకు అంగీకారమేనని, అయితే లక్ష రూపాయల నగదు, మోటార్ బైక్ కట్నంగా కావాలని అడిగాడు. సోనీది పేద కటుంబం కావడంతో ఆమె తండ్రి అందుకు నిరాకరించాడు. దీంతో పంచాయితీ పెద్దలు రూ.50 వేలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. దీంతో యువకుడి తండ్రి ఒప్పుకున్నాడు.


పెళ్లి ముహూర్తం కూడా నిర్ణయించారు. పెళ్లికి రెండ్రోజుల ముందు కట్నం డబ్బులు పట్టుకుని సోనీ తండ్రి పురుషోత్తం ఇంటికి వెళ్లాడు. అప్పుడు పురుషోత్తం తండ్రి చెప్పిన మాటలు విని సోనీ తండ్రి నివ్వెరపోయాడు. తమకు లక్ష రూపాయలు, బైక్ కావాల్సిందేనని, ఇవ్వకపోతే పెళ్లి వేదిక వద్దకు వచ్చేది లేదని తేల్చిచెప్పాడు. దీంతో షాకైన అతను తన కూతురు సోనీకి విషయం చెప్పాడు. మనస్తాపానికి గురైన సోనీ గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. విషయం తెలుసుకున్న పురుషోత్తం కుటుంబ సభ్యులు ఊరి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు.  

Updated Date - 2021-11-26T22:50:32+05:30 IST