ఆన్‌లైన్‌లో కొడుకు చేసే పని చూసి విస్తుపోయిన తండ్రి.. ఇదేంటని ప్రశ్నించడంతో 15ఏళ్ల కుర్రాడి షాకింగ్ నిర్ణయం.. అర్ధరాత్రి వేళ..

ABN , First Publish Date - 2021-11-21T17:18:17+05:30 IST

ఆ కుర్రాడికి 15ఏళ్లు. పుస్తకాలను పక్కన పడేసి.. తరచూ ఫోన్ పటుకునే కూర్చుంటున్నాడు. ఈ విషయాన్ని అతడి తండ్రి కొద్ది రోజులుగా గమనించాడు. ఆ తర్వాత విషయం ఆరా తీశాడు. ఆన్‌లైన్‌లో కొడుకు చేస్తున్న పని తెలుసుకుని విస్తుపోయాడు. ఆ తర్వాత

ఆన్‌లైన్‌లో కొడుకు చేసే పని చూసి విస్తుపోయిన తండ్రి.. ఇదేంటని ప్రశ్నించడంతో 15ఏళ్ల కుర్రాడి షాకింగ్ నిర్ణయం.. అర్ధరాత్రి వేళ..

ఇంటర్నెట్ డెస్క్: ఆ కుర్రాడికి 15ఏళ్లు. పుస్తకాలను పక్కన పడేసి.. తరచూ ఫోన్ పటుకునే కూర్చుంటున్నాడు. ఈ విషయాన్ని అతడి తండ్రి కొద్ది రోజులుగా గమనించాడు. ఆ తర్వాత విషయం ఆరా తీశాడు. ఆన్‌లైన్‌లో కొడుకు చేస్తున్న పని తెలుసుకుని విస్తుపోయాడు. ఆ తర్వాత అతడిని దగ్గరకు తీసుకుని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఆ కుర్రాడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో.. అందరూ పడుకున్న అర్ధరాత్రి వేళ అతడు చేసింది తెలుసుకుని ఆ కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. కాగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


చెన్నైలోని పాతచాకలి పేటకు చెందిన వెంకట్‌కుమార్ చెన్నై తాగునీటి బోర్డులో కాంట్రాక్టరు. అతడికి 15ఏళ్ల కుమారుడు ఉన్నాడు. 11వ తరగతి చదువుతున్న కుమారుడికి.. వెంకట్‌కుమార్ కొద్ది రోజుల క్రితం ఫోన్ కొనిచ్చాడు. సబ్జెక్ట్‌లకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకుంటాడని భావించాడు. అయితే.. ఆ కుర్రాడు సెల్‌ఫోన్‌ను డౌట్‌లు నివృత్తి చేసుకోవడం కోసం ఉపయోగించలేదు. అందరి కుర్రాళ్లలాగానే ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసయ్యాడు. ఈ క్రమంలో తాజాగా ఈ విషయాన్ని గుర్తించిన వెంకట్ కుమార్.. తన కొడుకును దగ్గరకు తీసుకుని ఆగ్రహం వ్యక్తం చేశాడు. చదవడం మానేసి గేమ్‌లు ఆడటం ఏంటని ప్రశ్నించాడు. దీంతో ఆ కుర్రాడు మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో వాళ్లతో మాట్లాడటం మానేశాడు. అంతేకాకుండా 17వ తేదీ రాత్రి ఇంట్లోంచి పారిపోయాడు. వెళ్తూ వెళ్తూ రూ.33లక్షల నగడు, కొంత బంగారం పట్టుకెళ్లాడు. దీంతో విషయం తెలుసుకుని.. వెంకట్‌కుమార్ కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడు తాంబరంలో ఉన్నట్లు గుర్తించి పోలీసలు అదుపులోకి తీసుకున్నారు. బంగారాన్ని తాకట్టు పెట్టి, నేపాల్ వెళ్లేందకు ఆ కుర్రాడు ప్రయత్నించినట్టు పోలీసులు వెల్లడించారు. 
Updated Date - 2021-11-21T17:18:17+05:30 IST