తల్లికి అన్నంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి అర్ధరాత్రి ఆ 14 ఏళ్ల కూతురు చేసిన నిర్వాకమిది..!

ABN , First Publish Date - 2021-07-08T22:53:50+05:30 IST

రోజూలాగానే బుధవారం రాత్రి కూడా తన కుమార్తెతో కలిసి గదిలో ఆమె నిద్రకు ఉపక్రమించింది. ఉదయం ఏడు గంటల సమయంలో మెలకువ వచ్చి చూస్తే గదిలో కుమార్తె కనిపించలేదు.

తల్లికి అన్నంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి అర్ధరాత్రి ఆ 14 ఏళ్ల కూతురు చేసిన నిర్వాకమిది..!

14 ఏళ్ల కుమార్తెతో కలిసి రోజూ ఆ తల్లి ఓ గదిలో నిద్రపోతుంటుంది. ఆమె భర్త మరో గదిలో పడుకునేవాడు. రోజూలాగానే బుధవారం రాత్రి కూడా తన కుమార్తెతో కలిసి గదిలో ఆమె నిద్రకు ఉపక్రమించింది. ఉదయం ఏడు గంటల సమయంలో మెలకువ వచ్చి చూస్తే గదిలో కుమార్తె కనిపించలేదు. బయట ఏమైనా ఉందేమోనని అంతా వెతికి చూసింది. ఎక్కడా కనిపించలేదు. విషయం భర్తకు చెప్పి.. అతడితో కలిసి బంధువులను ఆరా తీశారు. ఎవరూ తమ ఇంటికి రాలేదన్నారు. అమ్మాయి పక్కనే పడుకుని కూడా నీకు మెలకువ రాలేదా..? అని భర్త ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పుడు ఆమెకు అనుమానం వచ్చింది. రోజూ రాత్రిళ్లు అప్పుడప్పుడయినా మెలకువ వచ్చేది. కానీ బుధవారం రాత్రి మాత్రం అస్సలు మెలకువ రాలేదని చెప్పంది. గదిలో వెతికి చూస్తే నిద్రమాత్రలకు సంబంధించిన మెడికల్ షీట్లు కనిపించాయి. అప్పటికి కానీ వాళ్లకు అసలు విషయం బోధపడలేదు. తల్లికి అన్నంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి, ఆమె గాఢ నిద్రలోకి వెళ్లిన తర్వాత ఇంట్లోంచి వెళ్లిపోయిందని గ్రహించారు. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడే దీనికి కారణమని అనుమానించారు. దీంతో విషయం కాస్తా పోలీసుల వద్దకు చేరింది. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 


జలంధర్‌లో నివాసం ఉండే ఓ వ్యక్తి తన భార్య, 14 ఏళ్ల కుమార్తెతో కలిసి స్థానికంగా ఓ దుకాణం నిర్వహిస్తూ ఉండేవాడు. ఆ ప్రాంతంలోనే ఉండే భజన్ మణీ అనే కుర్రాడితో ఆ బాలిక ప్రేమలో పడింది. ఈ విషయం తెలిసి ఆ బాలిక తల్లిదండ్రులు అతడిని పలుమార్లు హెచ్చరించారు. దీంతో ఇద్దరూ కలిసి ఇంటి నుంచి పారిపోవాలనుకున్నారు. పెళ్లి చేసుకుంటానని ఆమెకు మాయమాటలు చెప్పడంతో అతడి మాటలకు ఓకే చెప్పింది. అతడు తెచ్చి ఇచ్చిన నిద్రమాత్రలను అన్నంలో కలిపి తల్లికి ఇచ్చింది. అన్నం తిన్న తర్వాత రాత్రి 9.30గంటల సమయంలో ఆ తల్లీకూతుళ్లిద్దరూ నిద్రకు ఉపక్రమించారు. పక్క గదిలోనే తండ్రి నిద్రపోయాడు. 


అర్ధరాత్రి సమయంలో ఆ బాలిక తన ప్రియుడితో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. వెళ్తూ వెళ్తూ తల్లి స్మార్ట్‌ఫోన్‌ను కూడా తనతోపాటు ఆ బాలిక తీసుకెళ్లిపోయింది. నిద్రమాత్రల ప్రభావంతో గాఢ నిద్రలోకి వెళ్లిన ఆ తల్లి.. తెల్లారిన తర్వాత చూస్తే కుమార్తె కనిపించలేదు. చివరకు ఇంట్లోంచి వెళ్లిపోయిందని ఆ భార్యాభర్తలిద్దరూ గ్రహించారు. తమ కుమార్తెను కిడ్నాప్ చేశాడంటూ భజన్ మణీపై జలంధర్ పోలీసులకు ఆ భార్యాభర్తలిద్దరూ ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆమె తీసుకెళ్లిన స్మార్ట్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా వారి ఆచూకీని తెలుసుకునే పనిలో పడ్డారు. 

Updated Date - 2021-07-08T22:53:50+05:30 IST