స్కూలుకు వెళ్తుండగా ఆ 8వ తరగతి బాలికకు సడన్‌గా కడుపునొప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్తే అసలు నిజం తెలిసి అవాక్కైన డాక్టర్లు..!

ABN , First Publish Date - 2021-11-26T17:52:33+05:30 IST

ఆ బాలికకు 13 సంవత్సరాలు.. ఎనిమిదో తరగతి చదువుతోంది..

స్కూలుకు వెళ్తుండగా ఆ 8వ తరగతి బాలికకు సడన్‌గా కడుపునొప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్తే అసలు నిజం తెలిసి అవాక్కైన డాక్టర్లు..!

ఆ బాలికకు 13 సంవత్సరాలు.. ఎనిమిదో తరగతి చదువుతోంది.. మూడు నెలల క్రితం పాఠశాలకు వెళ్తుండగా ఆమెకు తీవ్రంగా కడుపు నొప్పి వచ్చింది.. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.. స్కానింగ్ రిపోర్ట్ చూసిన వైద్యులు అవాక్కయ్యారు.. ఆ బాలిక ఆరు నెలల గర్భవతి అని తేల్చారు.. దీంతో కుటుంబ సభ్యులు ఆ బాలికను నిలదీయగా అసలు విషయం బయటపడింది.. సోదరులే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిసింది.. రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 


బికనీర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 13 సంవత్సరాల బాలిక తాజాగా ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగానే ఉన్నారు. గతేడాది ఆమె సోదరులే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆమె పాఠశాలకు వెళ్తుండగా తీవ్రంగా కడుపు నొప్పి వచ్చింది. హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. సోదరుల పైనే కేసు పెట్టాల్సి వస్తుందనే కారణంతో ఆ కుటుంబం ఆ ఘటనపై ఫిర్యాదు చేయలేదు. తాజాగా ఆ బాలికకు ప్రసవం జరిగింది. 


పీహెచ్‌సీ వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన వారు కూడా మైనేర్ బాలురే. ప్రస్తుతం అందరికీ డీఎన్‌ఏ పరీక్షలు చేస్తున్నారు. ఐదుగురు బాలురను అదుపులోకి తీసుకున్న పోలీసులు జువైనల్ హోమ్‌కు తరలించారు. 

Updated Date - 2021-11-26T17:52:33+05:30 IST