కరోనా పోరులో ఎందరికో ఆదర్శం ఈ తాతమ్మ!

ABN , First Publish Date - 2021-05-19T02:09:16+05:30 IST

ఈ మధ్య కాలంలో అనేకమంది వయోవృద్ధులు కరోనాను జయిస్తున్నారు. వయసు మీదపడినా కరోనాతో మాత్రం యువకుల మించిన పోరాటం చేసి విజయం ..

కరోనా పోరులో ఎందరికో ఆదర్శం ఈ తాతమ్మ!

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో అనేకమంది వయోవృద్ధులు కరోనాను జయిస్తున్నారు. వయసు మీదపడినా కరోనాతో మాత్రం యువకుల మించిన పోరాటం చేసి విజయం సాధిస్తున్నారు. నల్గొండలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఒకే కుటుంబంలోని ముగ్గురు వయో వృద్ధులు కరోనా బారి నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. అంతేకాదు ఇటీవలే రెండు డోసుల వ్యాక్సిన్ కూడా వీరు తీసుకున్నారు. మరో విచిత్రం ఏంటంటే వీరిలో ఓ తాతమ్మ వయసు 104. శతాధిక వృద్ధురాలైనా కరోనాను మట్టి కరిపించారామే. ఈ విషయాలను వారి మనవడు వినయ్ వెల్లడించారు. తాను హైదరాబాద్‌లోని ఉప్పల్, మేడిపల్లిలో ఉంటున్నామని, గతేడాది తన తాతమ్మ(రంగనాయకమ్మ-104), తాతయ్య (రామానుజాచార్యులు-88), (లక్ష్మమ్మ-79) కరోనా నుంచి కొలుకున్నారు.


వీరు ముగ్గురు నల్లగొండలోని సావర్కర్‌ నగర్‌లో నివశిస్తున్నారు. అయితే గతేడాది జూన్‌లో వీరు ముగ్గురూ కరోనా బారిన పడ్డారని, దీంతో వారిని హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్చించామని నవీన్ తెలిపారు. అదే సమయంలో తాము కూడా కరోనా బారిన పడ్డామని నవీన్ తెలిపారు. ‘కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం కొన్ని రోజులకు వారు ముగ్గురూ పూర్తిగా కోలుకొని తిరిగివచ్చారు. వారిచ్చినే ధైర్యంతో మేము కూడా కరోనాను జయించాం. వారు ముగ్గురూ ఈ మధ్యనే కరోనా టీకా 2 డోసులు తీసుకున్నారు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. కరోనా విషయంలో ప్రజల్లో చాలా భయాలున్నాయి. కానీ మా కుటుబంలో శతాధిక వృద్ధురాలు సైతం ఈ మహమ్మారిని జయించారు. ఈ విషయంలో ఎంతో మందిలో ఆత్మవిశ్వాసం నింపుతుందని నేను భావిస్తున్నాను’ అని వినయ్ వెల్లడించారు.


Updated Date - 2021-05-19T02:09:16+05:30 IST