ఈ కొండ రాయిని చేతులతో కదపొచ్చు!

ABN , First Publish Date - 2021-12-31T05:49:23+05:30 IST

ఒక పెద్ద కొండరాయిని మీరొక్కరే చేతులతో కదల్చగలరా? ఒక్కరు కాదు, పది మంది పట్టినా కొండరాయిని కదల్చడం సాధ్యంకాదు. కానీ ఫ్రాన్స్‌లోని హ్యుయెల్‌గోట్‌ పారెస్ట్‌లో

ఈ కొండ రాయిని చేతులతో కదపొచ్చు!

ఒక పెద్ద కొండరాయిని మీరొక్కరే చేతులతో కదల్చగలరా? ఒక్కరు కాదు, పది మంది పట్టినా కొండరాయిని కదల్చడం సాధ్యంకాదు. కానీ ఫ్రాన్స్‌లోని హ్యుయెల్‌గోట్‌ పారెస్ట్‌లో ఉన్న కొండరాయిని మాత్రం ఒక్కరే కదపొచ్చు. ఎలా సాధ్యం అంటారా? అయితే చదవండి.


ఫ్రాన్స్‌లోని హ్యుయెల్‌గోట్‌ ఫారెస్ట్‌లో ఏడు మీటర్ల పొడవు, 137 టన్నుల బరువున్న బ్లాక్‌ గ్రానైట్‌ రాయి ఉంది. ఈ రాయిని ఎవరైనా ఒట్టి చేతులతో కదపొచ్చు. ఈ రాయి మూలంగా ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది.

ఇంతకీ ఆ రాయి కదలడానికి కారణం ఏమిటో తెలుసా? అది ఉన్న స్థానం. అంతేకాదు, ఆ రాయిని కదిపేందుకు పట్టుకునే ప్రదేశం కూడా. సరైన ప్రదేశంలో పట్టుకుని కాస్త బలంగా కదిపితే చాలు రాయి కదిలిపోతూ ఉంటుంది. 

Updated Date - 2021-12-31T05:49:23+05:30 IST