ఎలుగుబంటి ఏం చెప్పింది?

ABN , First Publish Date - 2021-05-30T08:33:44+05:30 IST

ఒకరోజు ఇద్దరు స్నేహితులు అడవి గుండా నడుచుకుంటూ వెళుతున్నారు. ఆ ప్రాంతం వాళ్లకు కొత్త. అడవిజంతువులు సంచరించే ప్రాంతం కావడంతో ఇద్దరు స్నేహితులు చేతులు

ఎలుగుబంటి ఏం చెప్పింది?

ఒకరోజు ఇద్దరు స్నేహితులు అడవి గుండా నడుచుకుంటూ వెళుతున్నారు. ఆ ప్రాంతం వాళ్లకు కొత్త. అడవిజంతువులు సంచరించే ప్రాంతం కావడంతో ఇద్దరు స్నేహితులు చేతులు పట్టుకుని నడుస్తున్నారు. ఇంతలో ఒక ఎలుగుబంటి వారి వైపు వస్తుండటాన్ని  గమనించారు. దాంతో స్నేహితుల్లో ఒకడు వెంటనే దగ్గరలో ఉన్న చెట్టుపైకి గబగబా ఎక్కేశాడు. ఇంకోవాడు చెట్టు ఎక్కలేక కిందే ఉండిపోయాడు. ఎలుగుబంటి బారి నుంచి కాపాడుకోవడం కోసం తెలివిగా ఆలోచించాడు.


కిందపడుకుని ఊపిరి బిగబట్టి చనిపోయిన వాడిలా నటించాడు. ఎలుగుబంటి అతణ్ణి సమీపించి చెవి దగ్గర వాసన చూడటం మొదలుపెట్టింది. ఎలుగుబంటి శవాలను ముట్టుకోదు. అతను కూడా చనిపోయినట్టు భావించి ఎలుగుబంటి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తరువాత చెట్టుపై నుంచి దిగిన స్నేహితుడు ఎలుగుబంటి నీకు చెవిలో ఏం చెప్పిందిరా? అని అడిగాడు. అప్పుడు అతను ‘‘స్నేహం చేస్తున్నట్టు నటించే వారిని ఎప్పుడూ నమ్మకు’’ అని సలహా ఇచ్చింది అన్నాడు. 

Updated Date - 2021-05-30T08:33:44+05:30 IST