ఈ పక్షి వయస్సు 70 ఏళ్లు

ABN , First Publish Date - 2021-11-23T08:31:02+05:30 IST

పై చిత్రంలో కనిపిస్తున్న పక్షి వయస్సు 70 ఏళ్లు. ప్రపంచంలోనే ఎక్కువ వయస్సున్న అడవి పక్షిగా ఇది గుర్తింపు పొందింది...

ఈ పక్షి వయస్సు 70 ఏళ్లు

పై చిత్రంలో కనిపిస్తున్న పక్షి వయస్సు 70 ఏళ్లు. ప్రపంచంలోనే ఎక్కువ వయస్సున్న అడవి పక్షిగా ఇది గుర్తింపు పొందింది. లేసన్‌ ఆల్బాట్రాస్‌ అని పిలిచే ఈ పక్షిని 1956లో జీవశాస్త్ర పరిశోధకులు గుర్తించి బ్యాండ్‌ వేశారు. ఇటీవలే ఆ పక్షి మరో గుడ్డు పెట్టి పొదగడాన్ని గుర్తించారు. 1956లో యూఎస్‌ నేవీ బేస్‌లో ఛాండ్లర్‌ రాబిన్స్‌ అనే పరిశోధకుడు ఆ పక్షి గూడును చూశారు. ఆ గూడులో ఉన్న పక్షిని పట్టుకుని బ్యాండ్‌ వేశారు. ఆ పక్షికి విస్డమ్‌ అని పేరు పెట్టారు. కాకటూస్‌ అని పిలిచే పక్షులు 100 ఏళ్లు జీవిస్తాయి. అయితే ఒక అడవి పక్షి ఏడు దశాబ్దాల పాటు జీవించి ఉండటం పరిశోధకులను ఆశ్చర్యానికి గురిచేసింది. వీటిని సంరక్షిస్తే ఇంకా ఎక్కువ కాలం జీవిస్తాయని పరిశోధకులు అంటున్నారు. ఆల్బాట్రాస్‌ రెండు, మూడేళ్లకు ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది. తన ఏడు దశాబ్దాల జీవితకాలంలో 30 నుంచి 36 సార్లు పొదిగి ఉంటుందని పరిశోధకుల అంచనా.

Updated Date - 2021-11-23T08:31:02+05:30 IST