ఎగిరే పక్షి!
ABN , First Publish Date - 2021-05-05T05:30:00+05:30 IST
ముందుగా డ్రాయింగ్ షీట్‌పై పక్షి బొమ్మ గీసి కత్తిరించాలి. తరువాత క్రాఫ్ట్ కాగితంపై రెక్కలు ఏర్పడేలా ఆకారం గీసి వాటిని కూడా కత్తిరించాలి...

కావలసినవి
కలర్ క్రాఫ్ట్ పేపర్లు, దళసరి డ్రాయింగ్ షీట్లు, కత్తెర, దారం, జిగురు, టేప్
ఇలా చేయాలి...
- ముందుగా డ్రాయింగ్ షీట్‌పై పక్షి బొమ్మ గీసి కత్తిరించాలి. తరువాత క్రాఫ్ట్ కాగితంపై రెక్కలు ఏర్పడేలా ఆకారం గీసి వాటిని కూడా కత్తిరించాలి.
- రెక్కలను తిరగేసి సెల్లో టేప్ ఉపయోగించి మధ్యలో దారాన్ని అంటించాలి.
- ఇప్పుడు పక్షికి రెక్కలు అంటించాలి.
- రెక్కల మధ్యలో చిన్న రంధ్రం చేసి దారాన్ని కట్టాలి. అంతే... ఎగిరే పక్షి బొమ్మ రెడీ.