కంటెయినర్లతో ఇల్లు!
ABN , First Publish Date - 2021-03-10T05:54:56+05:30 IST
మూడు అంతస్థుల భవనం నిర్మించాలంటే గుంతలు తీయాలి, పిల్లర్లు పోయాలి, స్లాబ్ వేయాలి, గోడలు కట్టాలి... ఇలా చాలా పనులు నెలలు తరబడి చేస్తే కానీ పూర్తి కాదు. కానీ హూస్టన్‌లోని మెక్‌గోవెన్ స్ట్రీట్‌లో ఉన్న ఓ ఇంటిని చూస్తే మీ అభిప్రాయం
మూడు అంతస్థుల భవనం నిర్మించాలంటే గుంతలు తీయాలి, పిల్లర్లు పోయాలి, స్లాబ్ వేయాలి, గోడలు కట్టాలి... ఇలా చాలా పనులు నెలలు తరబడి చేస్తే కానీ పూర్తి కాదు. కానీ హూస్టన్‌లోని మెక్‌గోవెన్ స్ట్రీట్‌లో ఉన్న ఓ ఇంటిని చూస్తే మీ అభిప్రాయం మార్చుకుంటారు. ఎందుకో తెలుసా? బ్రూక్స్ అనే వ్యక్తి కంటెయినర్లతో మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నాడు.
- సరుకు రవాణాకు ఉపయోగించే పెద్ద పెద్ద షిప్పింగ్ కంటెయినర్లను చూసే ఉంటారు. హూస్టన్‌కు చెందిన డిజైనర్ విల్ బ్రూక్స్ ఆ కంటెయినర్లతో ఇల్లు నిర్మించుకున్నాడు. ఒక్కరోజులోనే మూడు అంతస్తుల నిర్మాణం పూర్తి చేశాడు. ఇందుకోసం 11 కంటెయినర్లను ఉపయోగించాడు.
- బయట నుంచి చూస్తే కంటెయినర్లు కనిపిస్తాయి కానీ లోపల అడుగుపెడితే మాత్రం సకల సదుపాయాలతో అధునాతన విల్లాను తలపించేలా ఉంటుంది.
- ఈ ఇంటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విల్ బ్రూక్స్ ఐడియాకు నెటిజన్లు హ్యాట్సాఫ్ అంటున్నారు.