కుక్కల్లోనూ ఫుడ్ అలర్జీ
ABN , First Publish Date - 2021-12-16T05:02:01+05:30 IST
పెట్‌డాగ్స్‌లో వచ్చే ముఖ్యమైన ఐదు అలర్జీల్లో ఫుడ్ అలర్జీ కూడా ఒకటి. ఈ ఫుడ్ ఎలర్జీనే వాటిని ఎక్కువ ఇబ్బంది పెడుతుంటుంది.

పెట్‌డాగ్స్‌లో వచ్చే ముఖ్యమైన ఐదు అలర్జీల్లో ఫుడ్ అలర్జీ కూడా ఒకటి. ఈ ఫుడ్ ఎలర్జీనే వాటిని ఎక్కువ ఇబ్బంది పెడుతుంటుంది. తల ఎక్కువ సార్లు ఆడించటం, కాళ్లతో చర్మాన్ని గీరుకోవడం విపరీతంగా చేస్తుంటే మీ పెంపుడు కుక్కకు ఫుడ్ అలర్జీ వచ్చినట్లే. మనుషుల్లాగే జంతువులకూ ఫుడ్ అలర్జీ ఉంటుంది. ఏ వయసు కుక్కలో అయినా ఈ అలర్జీ రావొచ్చు. ఒకే ఆహారాన్ని నెలలు, సంవత్సరాల తరబడి తీసుకున్న తర్వాతనూ ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పాల ఉత్పత్తులు, మాంసాహారం, గుడ్లు.. లాంటివి తీసుకున్నప్పుడు ఫుడ్ అలర్జీ వస్తుంది. అందుకే పెట్‌కు ఏ ఫుడ్ పడదు, ఏ ఫుడ్ పడుతుందో గమనించాలి. కుక్కల్లో వచ్చే ఫుడ్ ఇన్‌టోలరెన్స్‌కూ, ఫుడ్ అలర్జీకి తేడా ఉంది. ఉదాహరణకు ఓ కుక్క డైరీ ప్రోడక్ట్స్‌ను జీర్ణం చేసుకోవటం ఇబ్బంది అయినప్పుడు ఆ ఫుడ్ తినలేదు. దీన్ని ఫుడ్ ఇన్‌టోలరెన్స్ అంటారు. అయితే ఇమ్యూన్ సిస్టమ్‌కు సంబంధించిన సమస్య వస్తే మాత్రం అది ఫుడ్ అలర్జీ అవుతుంది. పెట్ డాగ్‌కి అలర్జీ ఉందని తెలుసుకోవటానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. బాగా గీరుకోవడం, హైపర్ యాక్టివ్ కావటంతో పాటు ఆహారపు వాంతులు అవుతాయి. ఫుడ్ అలర్జీ కలిగినపుడు కడుపునొప్పి సమస్యలు సాధారణంగానే వాటికి వస్తుంటాయి. బరువు తగ్గిపోయి వాటిలో శక్తి తగ్గిపోతుంటుంది. ముఖ్యంగా ఫుడ్ అలర్జీ వల్ల చర్మం మీద, చెవులు, పాదాల దగ్గర కూడా పొక్కులు వస్తాయి.