ఈ కారు కదిలే విల్లా!
ABN , First Publish Date - 2021-02-26T06:02:15+05:30 IST
ఇది చూస్తుంటే డబల్ డెక్కర్ బస్సులా ఉంది కదూ! కానీ ఇది సకల సదుపాయాలున్న కారు. ఇంకా చెప్పాలంటే కదిలే విల్లా!

ఇది చూస్తుంటే డబల్ డెక్కర్ బస్సులా ఉంది కదూ! కానీ ఇది సకల సదుపాయాలున్న కారు. ఇంకా చెప్పాలంటే కదిలే విల్లా!
నగరాల్లో స్థలం కొని, రెండు అంతస్తుల బంగ్లా కట్టుకోవాలంటే బోలెడు డబ్బు కావాలి. కానీ ఈ కారు కొనుక్కుంటే చాలు. ప్రయాణానికి వాహనంగా, ఆపితే విల్లాగా ఉపయోగపడుతుంది.
కారును పార్క్ చేసిన తరువాత ఒక బటన్ ప్రెస్ చేస్తే చాలు రెండు అంతస్తుల విల్లాగా మారుతుంది. రెండో అంతస్తులోకి చేరుకోవడానికి లిఫ్ట్ సౌకర్యం ఉంది. విశాలమైన బెడ్, కిచెన్, బాల్కనీ వంటి వసతులు ఉన్నాయి.
మాక్సస్ వి90 లైఫ్ హోమ్ విల్లా ఎడిషన్ పేరుతో రూపొందించిన ఈ కారు ప్రస్తుతానికి చైనా మార్కెట్లో అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.