అక్కడి ప్రజలకు అదే రైలు!
ABN , First Publish Date - 2021-05-06T05:30:00+05:30 IST
ప్యాసింజర్ రైలు చూసే ఉంటారు. ఎక్స్ప్రెస్ రైలు ఎక్కే ఉంటారు. కానీ బ్యాంబూ రైలు గురించి విన్నారా! ఆ విశేషాలు ఇవి....
- ప్యాసింజర్ రైలు చూసే ఉంటారు. ఎక్స్ప్రెస్ రైలు ఎక్కే ఉంటారు. కానీ బ్యాంబూ రైలు గురించి విన్నారా! ఆ విశేషాలు ఇవి....
- బ్యాంబూ ట్రెయిన్ అంటే రైల్వే శాఖ నడిపే రైలు కాదు. గ్రామస్తులు సొంతంగా కర్రతో తయారుచేసుకున్న ట్రాలీ. ఇది రైలు పట్టాలపైన దూసుకెళుతుంది. అందుకే వీటికి బ్యాంబూ ట్రెయిన్ అని పేరు.
- కాంబోడియాలోని బట్టంబ్యాంగ్ అనే ప్రాంతంలో ఈ తరహా రైలు ప్రయాణం కనిపిస్తుంది. అక్కడ రైళ్లు సమయానికి రావడం చాలా అరుదు. అందుకే స్థానికులు ప్రయాణం కోసం ఈ బ్యాంబూ ట్రెయిన్లను ఆశ్రయిస్తుంటారు.
- ఈ ట్రాలీలను అక్కడ నొర్రీస్ అని పిలుస్తారు. రైలుకు ఉండే చక్రాలే ఈ ట్రాలీకీ ఉంటాయి. కాకపోతే కాస్త చిన్న సైజులో ఉంటాయి. ఆ చక్రాలపైన కర్రతో చేసిన ట్రాలీ పెడతారు. చిన్న ఇంజన్ ఉంటుంది.
- ఎదురుగా రైలు వచ్చేది చూసుకుంటూ వెళతారు. ఒకవేళ అదే మార్గంలో రైలు వస్తున్నట్లయితే ట్రాలీ, వీల్స్ తీసి పక్కన పెడతారు. రైలు వెళ్లిపోయాక మళ్లీ అమర్చుకుని ప్రయాణం కొనసాగిస్తారు.