దీని వేట ప్రత్యేకం!
ABN , First Publish Date - 2021-05-29T05:30:00+05:30 IST
ఒక్కో జంతువు ఒక్కోరకంగా వేటాడుతుంది. కానీ ఈ పక్షి వేటాడే తీరును చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఆఫ్రికన్ హెరాన్ల జాతికి చెందిన బ్లాక్ ఎగ్రెట్స్ అనే పక్షి విశేషాలు ఇవి...
ఒక్కో జంతువు ఒక్కోరకంగా వేటాడుతుంది. కానీ ఈ పక్షి వేటాడే తీరును చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఆఫ్రికన్ హెరాన్ల జాతికి చెందిన బ్లాక్ ఎగ్రెట్స్ అనే పక్షి విశేషాలు ఇవి...
- ఈ పక్షి వేటాడే తీరు ప్రత్యేకంగా ఉంటుంది. చెరువుల్లో, కొలనుల్లో చేపలను ఆహారంగా తీసుకునే ఈ పక్షి వాటిని ఆకర్షించడం కోసం తన రెక్కలను గొడుగులా పెడుతుంది. ఇలా చేసి చేపలను ట్రాప్లోకి లాగుతుంది.
- రెక్కలను గొడుగులా పెట్టడంతో నీడకు చేపలు ఆకర్షితమవుతాయి. అంతేకాకుండా ఈ పక్షి పాదాలు పసుపు రంగులో ఉంటాయి.
- పసుపు రంగు పాదాలు, రెక్కల నీడతో చేపలను ఆకర్షించి ఆహారాన్ని సులభంగా సంపాదించుకుంటుంది. ఈ తరహా టెక్నిక్ మరే పక్షిలోనూ కనిపించదు.