ఇమ్యూనిటీ కోసం...
ABN , First Publish Date - 2021-06-14T05:54:25+05:30 IST
ప్రతిరోజూ మెంతులు నానబెట్టిన నీళ్లు ఒక గ్లాసు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. అవేమిటంటే...
ప్రతిరోజూ మెంతులు నానబెట్టిన నీళ్లు ఒక గ్లాసు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. అవేమిటంటే...
- కఫం ఎక్కువగా ఉన్న వారికి ఇది మంచి ఔషధం. కఫంతో బాధపడుతున్న వారిలో అగ్ని తక్కువగా ఉంటుంది. రోజూ మెంతి నీళ్లు తాగడం వల్ల శరీరంలో అగ్ని పుడుతుంది. ఫలితంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది.
- పాలిచ్చే తల్లులు ఈ నీటిని తాగడం వల్ల పాలు సమృద్ధిగా పడతాయి.
- రక్తంలో షుగర్ స్థాయిలను మెంతులు నియంత్రిస్తాయి. డయాబెటిస్ ఉన్న వారు మెంతులను డైట్ ప్లాన్‌లో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
- ఉదయం పూట మెంతులు నానబెట్టిన నీళ్లు తాగడం వల్ల జీవక్రియల రేటు పెరుగుతుంది. బరువు తగ్గుతారు.
- మెంతి నీరు యాంటాసిడ్‌గా పనిచేస్తుంది. రోజూ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రైటిస్ వంటి సమస్యలు దూరమవుతాయి.