త్వరలోనే అందుబాటులోకి రానున్న జైడస్ టీకా!

ABN , First Publish Date - 2021-05-08T18:49:27+05:30 IST

దేశంలో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా కొనసాగుతున్న ప్రస్తుతం తరణంలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

త్వరలోనే అందుబాటులోకి రానున్న జైడస్ టీకా!

దేశంలో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా కొనసాగుతున్న ప్రస్తుత తరణంలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన `జైకోవ్-డి` అత్యవసర వినియోగానికి అనుమతుల కోసం సంస్థ త్వరలోనే దరఖాస్తు చేయబోతోందట. ఈ నెలలోనే ఈ టీకాకు అనుమతులు లభిస్తాయని సంస్థ నమ్మకంగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 28 వేల మందిపై `జైకోవ్-డి` వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ను సంస్థ ప్రారంభించింది. ఈ నెలలోనే దీనికి సంబంధించిన మధ్యంతర ఫలితాలు రానున్నాయట.


ఆ ఫలితాలు వచ్చిన వెంటనే అత్యవసర అనుమతి కోసం దరఖాస్తు చేయనున్నారట. అనుమతులు లభించిన వెంటనే టీకా ఉత్పత్తి ప్రారంభిస్తామని, నెలకు కోటి డోసులు తయారు చేస్తామని కంపెనీ ఎండీ శార్విల్ పటేల్ వెల్లడించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్-వి మాదిరిగా ఇది రెండు డోసుల టీకా కాదు.. మూడు డోసుల టీకా. ఈ మూడు డోసుల టీకా వల్ల యాంటీ బాడీలు ఎక్కువ కాలం శరీరంలో ఉంటాయని తెలిపారు. 

Updated Date - 2021-05-08T18:49:27+05:30 IST