జూలో చిరుతను దత్తత పొందిన హీరోయిన్‌

ABN , First Publish Date - 2021-06-18T16:51:49+05:30 IST

ప్రముఖ శాండల్‌వుడ్‌ హీరోయిన్‌ కారుణ్యరామ్‌ మైసూరు జూ లోని చిరుతను దత్తత పొందారు. స్టార్‌హీరో దర్శన్‌ పిలుపునకు స్పందించిన కారుణ్యరామ్‌ చిరుతను దత్తత తీసుకుంటున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో

జూలో చిరుతను దత్తత పొందిన హీరోయిన్‌

 

బెంగళూరు: ప్రముఖ శాండల్‌వుడ్‌ హీరోయిన్‌ కారుణ్యరామ్‌ మైసూరు జూ లోని చిరుతను దత్తత పొందారు. స్టార్‌హీరో దర్శన్‌ పిలుపునకు స్పందించిన కారుణ్యరామ్‌ చిరుతను దత్తత తీసుకుంటున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకున్నారు. ఏడాది పాటు చిరుతకు అయ్యే ఖర్చును భరిస్తానని దానికి అవసరమైన అన్ని సౌలభ్యాలను చూస్తానని రాసుకున్నారు. ఇదే జూలో చిరుతను దత్తత పొందడమే కాకుండా ఇతరులకు ప్రోత్సహించిన దర్శన్‌కు ధ న్యవాదాలు అన్నారు. ఇటీవల దర్శన్‌ మైసూరు జూను సందర్శించి కొవిడ్‌ కాలంలో వన్యప్రాణులకు సమస్య గా మారుతోందని లాక్‌డౌన్‌తో వాటి పర్యవేక్షణ భారంగా మారిందని దయచేసి దత్తత తీసుకోండి అంటూ పిలుపునిచ్చారు. సదరు వీడియోలు వైరల్‌ కాగా పలు వురు ముందుకు వచ్చారు. ఇప్పటికే నిర్మాత శైలజానా గ్‌, సంగీతదర్శకుడు హరికృష్ణ, నటి కావ్యగౌడ, హీరో ఉపేంద్రలు దత్తత పొందారు. తాజాగా కారుణ్యరామ్‌ కూడా ప్రకటించారు. కొవిడ్‌ క్లిష్ట సమయంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంచారి విజయ్‌తో పాటు హీరో నీనాసం సతీష్‌లతో కలిసి డ్యాన్సర్‌లకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన కారుణ్యరామ్‌ మరో సేవకు సిద్ధం కావడంతో ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-06-18T16:51:49+05:30 IST